సౌత్ కొరియాలో విషాదం: హలొవెన్ ఈవ్‌లో తొక్కిసలాట, పదుల సంఖ్యలో మృతి
దక్షిణ కొరియాలో హలొవెన్ ఫెస్టివల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ చిన్న వీధి మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో అక్కడ ఉన్నవారికి చాలా మందికి గుండె పోటు వచ్చింది. పదుల సంఖ్యలో చనిపోయారు. వంద మంది వరకు గాయపడ్డారు. దేశంలో గల అధికార అగ్నిమాపక సిబ్బంది (చొయ్ చియన్ సిక్) గాయపడ్డవారి వివరాలను తెలియజేసింది.

ఇటవన్ లీజర్ జిల్లాలో జరిగిన ఘటనలో 100 మంది వరకు గాయపడ్డారని.. వారిలో 50 మంది గుండెపోటు వచ్చిందని తెలిపారు. హామిల్టన్ హోటల్ వద్ద ఒక్కసారిగా రష్ పెరిగిందట. దీంతో చాలా మందికి గుండెపోటు వచ్చిందని రిపోర్ట్ చేసింది. వెంటనే 400 మంది అత్యవసర సహాయక సిబ్బంది, 140 వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపడుతున్నాయి.
ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారులు తెలియజేయడం లేదు. ఆ వీడియోలో పడిపోయిన వారికి సీపీఆర్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్లో బ్లాంకెట్‌లలో గాయపడిన వారిని తీసుకెళుతున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స ఇవ్వాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు వూన్ సూక్ వొయి అధికారులను ఆదేశించారు. వైద్య సేవలు అందించడం లోటు రానీయొద్దని వైద్యారోగ్యశాఖకు స్పష్టంచేశారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications