1962లో భారత్‌పై చైనా యుద్ధానికి షాకింగ్ కారణాలు, నెహ్రూకు ఎంత చెప్పినా నమ్మలేదు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: భారత్ - చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధానికి హిమాలయ ప్రాంత సరిహద్దు ముఖ్య కారణమని చెబుతున్నప్పటికీ ఇతరత్రా కారణాలు ఉన్నాయి. తాజా చైనాస్ ఇండియా వార్ పుస్తకంలో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.

చదవండి: ఏలియన్స్ దాడి అంటూ: ఆకాశంలో వెలుగు, కాలిఫోర్నియాలో కలకలం

కమ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్ చైనాలో తన అధికారాన్ని తిరిగి బలోపేతం చేసుకునేందుకు భారత్‌పై యుద్ధం ప్రకటించారని ఈ పుస్తకం వెల్లడించింది. స్వీడన్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బెర్టిల్ లిట్నర్ రాసిన చైనాస్ ఇండియా వార్ పుస్తకాన్ని ఆక్స్‌పర్డ్ వర్సిటీ ప్రెస్ ప్రచురించింది.

తన స్థానం సుస్థిరం, చైనాను బలపడేలా చేయాల

తన స్థానం సుస్థిరం, చైనాను బలపడేలా చేయాల

మావో జిడాంగ్‌ 1962లో భారత్‌పై అకారణంగా యుద్ధం ప్రకటించాడు. అందుకు కారణాలను చైనాస్‌ ఇండియా వార్ పుస్తకంలో వెల్లడైంది. చైనాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు భారత్‌ను సాఫ్ట్‌ టార్గెట్‌గా భావించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. అప్పట్లో ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో కొత్తగా ఏర్పడిన స్వతంత్య్ర దేశాల్లో భౌగోళిక, రాజనీతి పరంగా చైనాను బలపడేలా చేయాలన్నది భారత్‌పై యుద్ధం ప్రకటించడానికి మరో కారణమని స్వీడెన్‌ స్ట్రాటెజిక్‌ ఎఫైర్స్‌ నిపుణుడు బెర్టిల్‌ లింట్నర్‌ ఈ పుస్తకంలో రాశారు.

నెహ్రూ ఫార్వార్డ్ పాలసీ కూడా

నెహ్రూ ఫార్వార్డ్ పాలసీ కూడా

నాటి ప్రధాని నెహ్రూ ప్రారంభించిన ఫార్వార్డ్ పాలసీ కూడా యుద్ధానికి దారితీయడానికి మరో కారణమేనని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా చైనాకి చెందిన ప్రాంతాల్లో ఎక్కువగా భారత బలగాలను నియమించి పెట్రోలింగ్‌ నిర్వహించడంతో అగ్గి మీద ఆజ్యం పోసినట్లైంది. మావో ప్రకటించిన యుద్ధంలో భారత్‌ చాలా నష్టపోయింది.

1958లోనే పథకం

1958లోనే పథకం

చైనాను ఆధునికీకరించేందుకు ఆ దేశం భారత్‌పై యుద్ధం చేయాలని 1958లోనే పథకం వేసినట్లుగా పేర్కొన్నారు. 1961 నాటికి మావో కారణంగా చైనాలోనే లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. టిబెట్‌ను చైనా 1959లో ఆక్రమించడంతో బౌద్ధ గురువు దలైలామా టిబెట్‌ నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందాడు. చైనాలో మావో తన స్థానాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం భారత్‌ను సాఫ్ట్‌ టార్గెట్‌గా చేసుకుని యుద్ధం ప్రకటించారు. అంతేకాదు భౌగోళిక రాజనీతిలో తమ స్థానాన్ని బలపరుచుకోవడం కోసం భారత్‌తో యుద్ధం ప్రకటించినట్టు పేర్కొన్నారు.

శ్రీరామ్‌కు వెంకయ్య ఫోన్పలుమార్లు నెహ్రూకు సూచన

శ్రీరామ్‌కు వెంకయ్య ఫోన్పలుమార్లు నెహ్రూకు సూచన

అప్పటికీ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఇంటెలిజెన్స్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న భోలానాథ్‌. చైనా యుద్ధానికి సిద్ధపడేలా ఉందని పలుమార్లు ప్రధానికి చెప్పారని, కానీ నెహ్రూ నమ్మలేదని, దాంతో భారత్‌పై యుద్ధాన్ని ఆపలేకపోయినట్లు పుస్తకంలో పేర్కొన్నారు.

స్వీడన్ రచయిత

స్వీడన్ రచయిత

మావో విధానాల వల్ల శరవేగంగా పారిశ్రామికీకరణ జరిగి కరువు కాటకాలను మిగిల్చింది. దీంతో కోట్లాది మంది ఆకలి చావులు జరిగాయి. దీని నుంచి కాపాడుకోవడం కోసంతో పాటు ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల కంటే తాను భౌగోళికంగా, రాజకీయంగా సుస్థిరంగా ఉండాలనే లక్ష్యాలతో భారత్ పైన యుద్ధం గెలవడం ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడని రచయిత పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Communist leader Mao Zedong declared war on India in 1962 because he saw the country as a "soft target" and thought the way to regain his own control over China would be unifying it against an outside enemy, says a new book.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి