ఏలియన్స్ దాడి అంటూ: ఆకాశంలో వెలుగు, కాలిఫోర్నియాలో కలకలం

Posted By:
Subscribe to Oneindia Telugu

కాలిఫోర్నియా: ఆమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో కలకలం చెలరేగింది. గ్రహాంతరవాసులు ఎవరైనా తమ వద్దకు వచ్చారా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అది ఓ కాంతిపుంజం అని ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్నారు.

కాలిఫోర్నియాకు 321 కిలోమీటర్ల దూరంలోని యాపిల్ వ్యాలీ నుంచి ఆకాశంలో అద్భుతమైన కాంతిపుంజం కనిపించింది. దక్షిణ కాలిఫోర్నియాలో చిన్న కాంతిగా మొదలై చివరకు హంసను పోలిన ఆకృతిలోకి వచ్చింది.

 ఏలియన్లు వచ్చి ఉంటారని ప్రచారం

ఏలియన్లు వచ్చి ఉంటారని ప్రచారం

దీనిని చూసిన వారు కాలిఫోర్నియాపై యూఎఫ్ఓ దాడి చేసిందని, ఏలియన్లే వచ్చి ఉంటారని రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ కూడా అర్థం కాని కాంతి ఏదో ఆకాశంలో కనిపిస్తోందని పేర్కొంది.

 అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు

అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు

దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. అయితే స్పెస్ ఎక్స్ అనే కంపెనీ ఇరీడియం కమ్యూనికేషన్స్ అనే సంస్థ కోసం ఫాల్కన్ 9 రాకెట్‌లో పది ఉపగ్రహాలను ఆకాశంలోకి తీసుకు వెళ్లిందని ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ భయపడాల్సిన పని లేదని చెప్పింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 అంతకుముందే చెప్పినప్పటికీ

అంతకుముందే చెప్పినప్పటికీ

ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో చోటు చేసుకుంది. ఇది లాస్ ఏంజిల్స్‌కు 150 కిలో మీటర్ల దూరంలోని వాండెర్ బర్గ్ ఎయిర్ బేస్ నుంచి లాంచ్ చేశారు. అంతకుముందే, ఈ ప్రయోగం జరగబోతున్నదని, దక్షిణ కాలిఫోర్నియా వాసులకు ఇది కనిపిస్తుందని అధికారులు ముందే చెప్పినట్లు లాస్ ఏంజిల్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

 వచ్చే నెలలో మరొకటి

వచ్చే నెలలో మరొకటి

అయినా చాలామంది దానిని చూసి భయపడ్డారు. ఇలాంటిది వచ్చే నెలలో మరొకటి ఉంటుందని చెప్పారు. కాగా, స్పెస్ ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్. ఈ సంస్థ మార్స్ పైకి మనుషులను తీసుకు వెళ్లే ప్రాజెక్టుపై చాలా రోజులుగా పని చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An iridescent streak lit up the sky over Southern California on Friday night, stopping traffic and leading some residents to marvel and others to worry about a UFO or even a nuclear bomb attack.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి