టోంగా దీవుల్లో భారీ భూకంపం.. సునామీ అలర్ట్ !
పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 7.1 గా తీవ్రత నమోదైంది. పంగైకి ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో.. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీని ప్రభావం నియు ద్వీపం వరకు విస్తరించిందని.. దాంతో దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రకటించారు. భూకంప కేంద్రం నుంచి 300 కి.మీ దూరంలో ప్రమాదకరమైన అలలు ఎగిసి పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.
ఇక తీర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని టొంగా అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు లేదా తీర ప్రాంతానికి దూరంగా వెళ్లాలని టోంగా నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ కార్యాలయం తెలిపింది.

టోంగాలో దాదాపు 1,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది తక్కువ ఎత్తులో ఉన్న ద్వీపసమూహం కావడంతో భూకంపాలు సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులఊ అలర్ట్ అవుతున్నారు.
మరోవైపు మయన్మార్‌లో భూకంప ధాటికి మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు పెద్దఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా అనేక ప్రాంతాలకు సహాయక బృందాలు చేరలేదని సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలానే థాయ్‌లాండ్ లోనూ 17 మంది మరణించగా.. 32 మంది గాయాలపాలయ్యారు. అయితే భారీ అంతస్తు కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications