జపాన్‌లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత... సునామీ హెచ్చరికలు జారీ...

జపాన్‌ వాతావరణ శాఖ ఆ దేశంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య కోస్తా తీరం వెంబడి భారీ భూకంపం సంభవించిన కొద్దిసేపటికే ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. అయితే భూకంపం కారణంగా ప్రాణనష్టం,ఆస్తి నష్టం సంభవించిందా అన్న వివరాలేవీ ఇంకా తెలియరాలేదు.

Massive earthquake of 7.2 magnitude shakes Japan; tsunami warning issued

జపాన్ కాలమానం ప్రకారం శనివారం(మార్చి 20) సాయంత్రం 6గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఇషినోమకి ప్రాంతానికి తూర్పున 34కిలోమీటర్ల దూరంలో భూమి లోపల 60కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు గుర్తించారు. భూకంప ప్రభావంతో జపాన్ రాజధాని టోక్యోలోనూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది.

తాజా భూకంపంతో తొహొకు ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ ఒనగవాలోని తమ న్లూక్లియర్ ప్లాంట్‌ను మూసివేసింది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేఫన్ ఫుకుషిమాలోని దాయి ఇచి పవర్ స్టేషన్ పరిస్థితిని తనిఖీ చేసింది. 2011లో భూకంపం సంభవించిన సమయంలో ఈ పవర్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు కూడా పలు ప్రాంతాల్లోని పవర్ స్టేషన్లలో భూకంపం కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో జపాన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో పాటు పలుచోట్ల రైలు సర్వీసులు కూడా నిలిచిపోయినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

ఎన్‌హెచ్‌కే న్యూస్ అనే మీడియా సంస్థ సెందాయ్ సిటీలో భూ ప్రకంపనలకు సంబంధించి ఒక వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+