Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భయానకం- గుండెలు అద్దిరిపోయే విజువల్స్

చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిచువాన్ ప్రావిన్స్‌లో కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన హాంగ్‌కీ వంతెన కుప్పకూలింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో తునాతునకలైంది. టిబెట్‌కు వెళ్లే జాతీయ రహదారిలో కీలకమైన వంతెన ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సిచువాన్ ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు.

చైనా ప్రధాన భూభాగాన్ని టిబెట్‌తో కలిపే ఈ వంతెన- ఆ దేశ కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి వంతెనపై పడ్డాయి. వాటి ధాటికి అది ఏ మాత్రం తట్టుకోలేకపోయింది. పేకమేడలా కుప్పకూలింది. ఈ సంఘటన సిచువాన్ ప్రావిన్స్ మార్కాంగ్ సిటీ సమీపంలోని షువాంగ్జియాంగ్‌ కౌ జలవిద్యుత్ కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది.

Massive Landslide Wreaks Havoc Watch the Hongqi Bridge Collapse in Real-Time

కొలిన్ రగ్ అనే ఎక్స్ హ్యాండిల్ లో ఈ వీడియో పోస్ట్ అయింది. బ్రిడ్జి కూలుతున్న సమయంలో తీసిన విజువల్స్ భీతావహంగా కనిపించాయి. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్నాయి. కొండచరియలు విరిగిపడటం కూడా ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. అవి పడిన వెంటనే భారీగా ధూళి ఆకాశంలోకి ఎగజిమ్మింది. వంతెన శిథిలాలు గాల్లోకి ఎగిసిపడటం ఇందులో చూడొచ్చు.

క్షణాల్లో వంతెన కింద భూమి కుంగిపోవడం, దాని స్తంభాలు ఒరిగిపోవడం, అవన్నీ కూడా నదిలోకి కూలిపోయాయి. చైనా నైరుతి దిశగా ఉంటుందీ సిచువాన్ ప్రావిన్స్.758 మీటర్ల పొడవైన వంతెన ఇది. టిబెట్ తో అనుసంధానించడానికి చైనా దీన్ని నిర్మించింది. కొన్ని నెలల కిందటే ఇది లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయి సంవత్సరం కూడా కాలేదని స్థానిక మీడియా తెలిపింది. కొండచరియలు విరిగిపడటం వల్లే వంతెన కూలిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు వివరించింది.

ఇది ప్రమాదకర స్థితికి చేరుకుందనే విషయాన్ని అధికారులు ముందుగానే పసిగట్టారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ వంతెన మీదుగా రాకపోకలను నిలిపివేశారు. సమీపంలోని కొండచరియలు, రహదారులపై పగుళ్లతో పాటు, భూమి కదులుతున్న సంకేతాలు కనిపించడంతో ప్రమాదాన్ని గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. ఏటవాలుగా ఉన్న పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటమే కూలిపోవడానికి కారణం. ప్రమాద నష్టాన్ని అంచనా వేయడానికి, వంతెన భద్రత గుర్తించడానికి అత్యవసర, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+