పహల్గాం ఉగ్రవాదులేనా?! కొలంబో ఎయిర్ పోర్ట్‌లో భారీ సెర్చ్ ఆపరేషన్

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో మారణకాండకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాలు తీవ్రంగా వేట కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో భారత్ ఇచ్చిన సమాచారం మేరకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. పహల్గాం ఉగ్రఘటనలో పాల్గొన్నారని భావిస్తున్న ఆరుగురు వ్యక్తులు చెన్నై నుంచి శ్రీలంక వెళ్లే విమానం ఎక్కి ఉండొచ్చని భారత ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేయడంతో ఈ తనిఖీలు జరిగాయి.

శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (UL122) బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న తర్వాత ఆ ఆపరేషన్ జరిగింది. శ్రీలంక పోలీసులు, ఆ దేశ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ విభాగం కలిసి ఆ తనిఖీలు నిర్వహించాయి. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి తమకు అలర్ట్ వచ్చినట్లు విమానయాన సంస్థ తెలిపింది. అయితే, ఎలాంటి అనుమానితుడిని గుర్తించకపోవంతో తదుపరి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది.

Massive search operation at Colombo Airport based on information from India

కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు తీసిన విషయం విధితమే. ఉగ్రదాడులు అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదుల వేటను తీవ్రతరం చేశాయి. సరిహద్దు ప్రాంతాలతోపాు జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు.

పలువురు ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఉగ్రవాదులకు సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులకు పాల్పడ్డారు. ఏప్రిల్ 15నే పహల్గాం చేరుకున్న ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నారు. బైసరన్ వ్యాలీ ప్రాంతం తమకు అనుకూలంగా ఉండటంతో ఇక్కడే పర్యాటకులపై దాడులకు పాల్పడ్డారని విచారణలో భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. ఉగ్రవాదులకు స్థానికులు కొంతమంది సహరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అయిన పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్. తాజాగా, ఆ దేశానికి ఎగుమతులు, దిగుమతులు రద్దు చేసి భారీ షాకిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+