Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తీవ్ర ఆందోళనలో భారత్- ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటూ

ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవిస్తోన్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిణామాలపై భారత్ అలర్ట్ అయింది. ఇరాన్, ఇజ్రాయెల్ లల్లో నివసించే పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలను మానుకోవడం లేదా వాయిదా వేసకోవాలని కోరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇరాన్, ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఇక్కడ భారతీయులందరూ రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని పేర్కొంది.

MEA Urges Indians in Iran to Stay Put and Keep Close Contact With the Embassy Amid Rising Tensions

పరిస్థితులు చేయి దాటుతున్నాయని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సంచారాన్ని నియంత్రించుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ సర్వీసులతో సహా రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటైంది. వెనిజులాలో నెలకొన్న అనిశ్చిత, ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి వివరించింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ఇరాన్, ఇజ్రాయెల్ లో నివసించే భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, తమను నిరంతరం సంప్రదిస్తూ ఉండాలని సూచించింది.

పౌరులు తమ నివాస లేదా పని ప్రాంతంలో సమీపంలోని రక్షణ స్థలాలను తెలుసుకుని వాటికి దగ్గరగా ఉండాలని, స్థానిక వార్తలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించాలని కోరింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి https://www.oref.org.il/eng ను సందర్శించాల్సి ఉంటుంది. ఏ అత్యవసర పరిస్థితికైనా, 24x7 హెల్ప్‌లైన్ +972-54-7520711 లేదా [email protected] ద్వారా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

వ్యాపారం, ఇతర వ్యక్తిగత పనులపై ఇరాన్ కు వెళ్లిన భారతీయులు కూడా వెంటనే స్వదేశానికి తిరిగి రావలని కోరింది. భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+