వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ డైమండ్ రింగులు, బ్రేస్ లెట్లు.. మెహుల్ చోక్సీపై గర్ల్‌ఫ్రెండ్ బార్బరా జారాబికా

|
Google Oneindia TeluguNews

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ స్కామ్‌లో ప్ర‌ధాన సూత్ర‌ధారి మెహుల్ చోక్సీ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి. అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న బార్బ‌రా జారాబికా ఈ వివరాలు వెల్లడించారు. చోక్సి కిడ్నాప్ ఉదంతంలో త‌న పాత్ర ఏమీ లేద‌ని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె స్ప‌ష్టం చేశారు. గ‌తేడాది తాను ఆంటిగ్వా వెళ్లిన‌ప్పుడు చోక్సీ త‌న‌కు ప‌రిచ‌య‌ం అయ్యాడ‌ని, త‌న‌ను తాను రాజ్‌గా ప‌రిచ‌యం చేసుకున్నాడ‌ని చెప్పింది.

Recommended Video

కలకలం రేపుతున్న మెహుల్ చోక్సీ వీడియో...!
డైమండ్ రింగ్.. కానీ

డైమండ్ రింగ్.. కానీ

చోక్సీ తనకు ఫ్రెండ్‌ అని.. గ‌తేడాది ఆంటిగ్వా వెళ్లిన‌ప్పుడు క‌లిశాడని వివరించారు. తొలుత ఫ్రెండ్లీగా ఉండి త‌ర్వాత న‌న్ను ఫ్ల‌ర్ట్ చేశాడని వాపోయింది. అత‌ను తనకు డైమండ్ రింగులు, బ్రేస్‌లెట్లు కూడా ఇచ్చాడని.. కానీ అవ‌న్నీ న‌కిలీవ‌ని త‌ర్వాత తెలిసిందని ఆమె చెప్పింది. త‌న పేరును అన‌వ‌స‌రంగా చోక్సీ లాయ‌ర్లు, కుటుంబ స‌భ్యులు ఇందులోకి లాగార‌ని బార్బరా వాపోయింది.

ఏ పాపం తెలీదు

ఏ పాపం తెలీదు

చోక్సీ కిడ్నాప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఈ ఉదంతంతో తాను, కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నామ‌ని ఆమె చెప్పింది. త‌న‌ను బార్బ‌రా జారాబికా ఇంటి నుంచి కిడ్నాప్ చేశార‌ని, బోట్‌లో డొమినికాకు తీసుకొచ్చార‌ని ఆంటిగ్వా పోలీసుల‌కు రాసిన లేఖ‌లో చోక్సీ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో బార్బరా రియాక్ట్ అయ్యారు.

ఎంక్వైరీ..

ఎంక్వైరీ..


పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టి పారిపోయిన మెహుల్ చోక్సీ.. ఎట్టకేలకు డోమినికాలో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే తనను పోలీసులు అపహరించారని.. తర్వాత చిత్రహింసలకు గురిచేశారని చోక్సీ ఆరోపించారు. దీంతో ఆంటిగ్వా, బార్బుడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్‌నకు సంబంధించి చోక్సీ లాయర్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం స్పందించింది.

విదేశాల్లో నక్కీ

విదేశాల్లో నక్కీ

చోక్సీ, అతని మేనల్లుడు పీఎన్బీ నుంచి 14 వేల కోట్ల రుణం తీసుకొని ఎగవేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చోక్సీ ఆంటిగ్వా వెళ్లిపోగా.. నీరవ్.. లండన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. చోక్సీని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది. దీనిపై డోమినికా కోర్టు స్టే విధించింది. బుధవారం వరకు అప్పగించడంపై స్టే విధించింది. దీంతో భారత సర్కార్.. చోక్సీని తీసుకొచ్చే పత్రాలు పంపి.. ఇండియా తీసుకొచ్చే యత్నాల్లో ఉంది. డోమినికా నుంచి నేరుగా భారత్ తీసుకురావాలని అనుకుంటుంది. పొరపాటున ఆయన ఆంటిగ్వా వెళితే.. చోక్సీకి.. చట్టపరమైన, రాజ్యాంగ రక్షణ దక్కనున్నాయి.

English summary
fugitive diamantaire Mehul Choksi alleged that his "friend" Barbara Jabarica was instrumental in his abduction, Jabarica in an interview with India Today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X