వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైవర్స్-డిస్టెన్స్: ట్రంప్‌ను కాదని సైనికుడితో మెలానియా -అసలేంటీ రచ్చ -చిట్టచివరి వేడుక

|
Google Oneindia TeluguNews

''15ఏళ్లుగా భరిస్తోన్న అవమానాలకు మెలానియా ముగింపు కోరుకుంటోంది.. అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నుంచి బయటపడే క్షణాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి దిగిపోయిన మరుక్షణం అతని నుంచి దూరమైపోవడానికి అమె అన్ని రకాలుగా సిద్ధమైంది.. తానేం తక్కువ తినలేదన్నట్లు ట్రంప్ కూడా పలు రకాల విడాకుల కండిషన్లతో ఆమెను కట్టడిచేయాలనుకుంటున్నారు..''అంటూ వైట్ హౌజ్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్ ఒమరాసా న్యూమన్, మెలానియా ట్రంప్ మాజీ సలహాదారు స్టెఫనీ వాకోఫ్ లు ఇచ్చిన సంచలన స్టేట్మెంట్లు ప్రపంచమంతటా పాకిపోయిన తర్వాత జనం.. ట్రంప్ దంపతులను చూస్తోన్న తీరు కూడా మారిపోయింది. ఆ క్రమంలోనే..

పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్

 మెలానియా చర్యకు అర్థమేంటి?

మెలానియా చర్యకు అర్థమేంటి?


తాజా ఎన్నికల్లో ఓటమిని అంగీకరించబోనంటోన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఫలితాల తర్వాత మొట్టమొదటిసారి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు. భార్య మెలానియాతో కలిసి ఆయన.. బుధవారం(11న) జరిగిన వెటరన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా ఆర్మీలో సేవలందించిన వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది వెటరన్స్ డేను జరుపుతారు. ప్రెసిడెంట్, ఫస్ట్ లేడీ కలిసి ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికను సందర్శించిన సమయంలో చోటుచేసుకున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ట్రంప్ తో డైవర్స్ తీసుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఫస్ట్ లేడి మెలానియా.. ఫజికల్ డిస్టెన్స్ నియమాలను పక్కనపెట్టిమరీ మాస్క్ ధరించకుండా ట్రంప్‌కు దూరంగా.. ఓ సైనికుడి చేయి పట్టుకుని నడవటం, నిమిషాపాటు సాగిన ఆ కార్యక్రమంలో సదరు జవాను చేయి వీడకపోవడం చర్చనీయాంశం అయ్యాయి. వందల కెమెరాలు తనను గమనిస్తున్నాయని తెలిసి కూడా మెలానియా భర్తకు దూరంగా వ్యవహరించడంలో అర్థమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే..

 మెలానియా-ట్రంప్ టెన్షన్..

మెలానియా-ట్రంప్ టెన్షన్..

వెటరన్ డే వేడుకలో మెలానియా వ్యవహరించిన తీరుపై ప్రముఖ బాడీ లాంగ్వేజ్ నిపుణురాలు జూడీ జేమ్స్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆమెలో టెన్షన్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నదని, సైనికుడి చేతిని గట్టిగా పట్టుకోవడం ద్వారా ఆమె సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చారని, అదే సమయంలో పరేడ్ లో ఎప్పుడు నడవాలో, ఎక్కడ ఆగాలో, ఎటువైపునకు తిరగాలో ఆ సైనికుడి సూచనలకు అనుగుణంగా ప్రోటోకాల్ పరిరక్షణకు మెలానియా ప్రయత్నించారని జూడీ తెలిపారు. అయితే ట్రంప్ బాడీ లాగ్వేజ్ ప్రకారం ఆయన విపరీతమైన ఒత్తిడిలో ఉన్నట్లు ప్రస్పుటంగా తెలుస్తోందని, వైట్ హౌజ్ ను వీడిన తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ దృశ్యాలు ఐకానిక్ లా కనబడటంలో వింతేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇవాంకా ట్రంప్ సహా అందరూ మాస్కు ధరించినా, ట్రంప్, మెలానియా మాత్రం వితౌట్ మాస్క్ దర్శనమిచ్చారు. కాగా,

 చేయి పట్టుకుంటే అంతేనా?

చేయి పట్టుకుంటే అంతేనా?

‘‘వెటరన్ డే ఈవెంట్ లో సైనికుడి చేయి పట్టుకున్న మెలానియాపై గోరంతలు కొండంతలుగా పుకార్తు వస్తున్నాయి. నిజానికి ఆ సమయంలో ఆర్లింగ్టన్ స్మశానవాటిక దగ్గర జల్లులు పడుతున్నాయి. తడినేలపై హైహీల్స్ లో నడవడం ఎవరికైనా కష్టమే, అదీగాక, మెలానియాతోపాటు అక్కడికి వచ్చిన ప్రతి మహిళ(డిగ్నిటరీలు) సైనికుల చేయి పట్టుకునే నడిచారు. ఫస్ట్ లేడీకి గొడుగు పట్టడం, వారికి సహాయం చేయడమే ఆ సైనికుల పని. ట్రంప-మెలానియా విడిపోతున్నారనే వార్తల వల్లే మనం వారిని చూసే దృష్టికోణం మారింది'' అని జూడీ జేమ్స్ చెప్పుకొచ్చారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ జోబైడెన్ తన సతీమణి జిల్ తో కలిసి ఫిలడెల్ఫియాలోని కొరియన్ వార్ మెమోరియల్ వద్ద వెటరన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే..

Recommended Video

US Election 2020 Results: Trump Wins Alaska, Joe Biden On Donald Trump
 వైట్‌హౌజ్‌లో చివరి వేడుక..

వైట్‌హౌజ్‌లో చివరి వేడుక..

ఎన్నికల్లో అక్రమాలను ఎలాగైనాసరే బయటపెట్టి, తానే గెలిచానని నిరూపించుకునేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ నానా తంటాలు పడుతున్నారు. భార్య మెలానియా, కూతురు ఇవాంకాలు మాత్రం ఒటమిని హుందాగా అంగీకరిద్దామని ట్రంప్ ను సముదాయిస్తుండగా.. కొడుకులు ఎరిక్, జూనియర్, అల్లుడు కుష్నర్ లు మాత్రం న్యాయపోరాటం కొనసాగిద్దామని ట్రంప్ ను ఎగదోస్తున్నట్లు సీఎన్ఎన్ వార్త సంస్థ పేర్కొంది. చివరికి ఎలాగైనా ట్రంప్ దిగిపోవాల్సిన నేపథ్యంలో మెలానియా.. వైట్ హౌజ్ లో తమ చిట్ట చివరి క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. గతంలో లేనంత వైరైటీ డెకరేషన్ తో, కలకాలం గుర్తుండిపోయేలా క్రిస్మస్ జరుపుకోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెలానియాకు సంబంధించి అది వైట్ హౌజ్ లో చివరి క్రిస్మస్ అవుతుందా? లేక ట్రంప్ తో కలిసి చివరి పండుగ అవుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది..

English summary
Internet has erupted over a new photo of United States First Lady Melania Trump ignoring social distancing as she walked arm-in-arm with a serviceman and stood away from the President during November 11's Veterans Day wreath-laying ceremony. Melania Trump ‘tense’ while Donald Trump under clear ‘pressure’ as divorce rumours swirl, body language expert claims
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X