జ్ఞానేశ్వరి కోసం NDRF హైఅలర్ట్ ఆపరేషన్! క్షణక్షణం ఉత్కంఠ..

అది కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పరిధిలోని సీహెచ్ అగ్రహారం. పచ్చని పామాయిల్ తోటలు, ప్రశాంతమైన వాతావరణం. కానీ, గత తొమ్మిది రోజులుగా అక్కడ భయానక నిశ్శబ్దం అలుముకుంది. తోట కాపలాదారులుగా పనిచేసే సుంకర గణేష్, భవాని దంపతుల ముద్దుల కూతురు, రెండేళ్ల పసికందు జ్ఞానేశ్వరి (జానూ) ఈ నెల 6వ తేదీన అదృశ్యమైంది. రోజులు గడుస్తున్నా ఆ పాప ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు ఆ చిన్నారిని ఎవరో అపహరించారా? లేక దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందా? అనే ప్రశ్నలు మిస్టరీగా మారిన తరుణంలో, ఈ కేసులోకి ఊహించని ఒక బిగ్ ట్విస్ట్ వచ్చి చేరింది.

క్లూ ఇవ్వాల్సిన విశ్వాసపాత్రురాలు.. శవమై తేలింది!

ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆ పామాయిల్ తోటలోనే ఉండే ఒక పెంపుడు కుక్క అత్యంత కీలకంగా మారింది. సాధారణంగా ఆ చిన్నారి ఎక్కడికి వెళ్లినా నీడలా వెంట నడిచే ఆ కుక్క.. పాప అదృశ్యమైన రోజు నుంచి తోట పరిసరాల్లో వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. అది ఖచ్చితంగా పోలీసులకు ఏదో ఒక క్లూ ఇస్తుందని భావిస్తున్న తరుణంలో.. శనివారం ఉదయం ఆ పెంపుడు కుక్క అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించింది.

NDRF and Thermal Drones Join Search for Missing Kid Jnaneswari After Dog Dies in Tuni

కేసును చేధించడంలో కీలకమైన కుక్క అకస్మాత్తుగా చనిపోవడం వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాప ఆచూకీ దొరకకుండా చేయడానికే ఎవరైనా దానికి విషం పెట్టారా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆ కుక్కకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆ నివేదిక వస్తే గానీ ఈ మరణం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడదు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. జల్లెడ పడుతున్న 400 మంది సిబ్బంది!

చిన్నారి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. పాప ఆచూకీ కోసం కేవలం పోలీసులు మాత్రమే కాకుండా, అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, ఎక్స్‌పర్ట్స్, NDRF, SDRF బృందాలను రంగంలోకి దించారు.

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్: కుక్క వింతప్రవర్తన, కుక్కకు జీపీఎస్ ట్రాకర్ తో సెర్చ్
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్: కుక్క వింతప్రవర్తన, కుక్కకు జీపీఎస్ ట్రాకర్ తో సెర్చ్

దట్టమైన అడవుల్లోకి చొచ్చుకెళ్లగల 400 మందికి పైగా ఉన్నత స్థాయి సిబ్బంది ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాలను అణువణువూ గాలిస్తున్నారు. దట్టమైన పొదలు, గుబురు అడవుల్లో నేల మార్గాన వెతకడం కష్టంగా మారడంతో, అత్యాధునిక 'థర్మల్ డ్రోన్ల' సహాయం తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో కూడా శరీర ఉష్ణోగ్రతను బట్టి జీవులను గుర్తించగల ఈ డ్రోన్లు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

నిమిష నిమిషం మానిటరింగ్.. హోం మంత్రి సమీక్ష!

ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతిరోజూ కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడుతూ కేసు వివరాలపై ఆరా తీస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు.

"ఈ కేసులో అన్ని శాఖల అధికారులు అత్యంత సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికైనా వెనకాడటం లేదు. పెంపుడు కుక్క మృతితో కేసు మరింత సున్నితంగా మారింది. ప్రతీ యాంగిల్‌ను క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం" అని హోం మంత్రి అనిత తెలిపారు.

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకమైన కుక్క మృతి!
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకమైన కుక్క మృతి!

ప్రస్తుతం తుని పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పెంపుడు కుక్క మరణం వెనుక ఉన్న మిస్టరీ వీడితేనే.. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుందనే ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ అదృశ్యం వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? ఆ రెండేళ్ల చిన్నారి ప్రస్తుతం ఎక్కడుంది? అనే సస్పెన్స్ క్లైమాక్స్‌కు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+