శభాష్ నితీష్ రెడ్డి- ప్రెస్ మీట్లో అమ్మ ఫోన్ కాల్ పై లోకేష్ ప్రశంసలు..!
ఏపీకి చెందిన టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish kumar Reddy) పై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ ప్రశంసల జల్లు కురిపించారు. అయితే అది నిన్న ఆప్ఘనిస్తాన్ తో జరిగిన తొలి వన్డేలో వికెట్లు తీసినందుకో, పరుగులు చేసినందుకో కాదు. మరో వ్యక్తిగత అంశంలో నితీష్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు లోకేష్ ను ఆకట్టుకుంది. దీంతో నితీష్ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ లోకేష్ ప్రశంసలతో ట్వీట్ చేశారు. దీంతో ఇప్పటికే వైరల్ అవుతున్న నితీష్ వీడియోతో పాటు లోకేష్ ట్వీట్ కూడా ప్రసంశలు అందుకుంటోంది.
అసలు విషయానికొస్తే.. నితీష్ కుమార్ రెడ్డి నిన్న ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్బుతమైన ప్రదర్శన చూపాడు. 2 వికెట్లు తీశాడు. సెంచరీ చేసి ఊపుమీదున్న ఆప్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న నితీష్ రెడ్డి.. తన ప్రదర్శనతో పాటు జట్టు ఆటతీరుపైనా మాట్లాడాడు. అలా మాట్లాడుతున్న క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి ఫోన్ మోగింది.

Whether it's cricket or a press conference, Mom comes first. ❤️👏
— Lokesh Nara (@naralokesh) June 14, 2026
Well played, Nitish!#INDvAFG pic.twitter.com/AtJKp6eNho
చూస్తే తన తల్లి నుంచి వస్తున్న ఫోన్ కాల్. ప్రెస్ మీట్ లో ఉన్నాడు కాబట్టి ఈ ఫోన్ కాల్ కట్ చేయొచ్చు, లేదా అటెండ్ చేయకుండా సైలెంట్ కూడా చేయొచ్చు. కానీ నితీష్ రెడ్డి మాత్రం అలా చేయలేదు. ప్రెస్ మీట్లో పాల్గొన్న మీడియా ప్రతినిధుల్ని క్షమించాలని కోరుతూ ఆ ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేశాడు. అటువైపు ఉన్న తన తల్లిని ఉద్దేశించి.. అమ్మా మళ్లీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత యథావిధిగా ప్రెస్ మీట్ కొనసాగించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. నితీష్ ఎంత టీమిండియా క్రికెటర్ అయినా తల్లికి మాత్రం కొడుకేగా అంటూ అందరూ అభినందిస్తున్నారు. దీనిపై లోకేష్ కూడా స్పందిస్తూ.. "క్రికెట్ అయినా, విలేకరుల సమావేశం అయినా... అమ్మే అన్నింటికంటే ముఖ్యం. ❤️👏చాలా బాగా ఆడావు, నితీష్!" అంటూ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications