మెర్కెల్ మెరుపులు, వరుసగా నాలుగోసారి ఛాన్సలర్‌గా..
జర్మనీలో మెర్కెల్ మళ్లీ మెరుపులు మెరిపించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జర్మనీ ఛాన్సలర్‌గా వరుసగా నాలుగోసారి ఆమె విజయం సాధించారు.
బెర్లిన్: జర్మనీలో మెర్కెల్ మళ్లీ మెరుపులు మెరిపించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జర్మనీ ఛాన్సలర్‌గా వరుసగా నాలుగోసారి ఆమె విజయం సాధించారు. దీంతో ఆమె ప్రాతినిధ్యం వహించిన క్రిస్టిన్ డెమక్రటిక్ యూనియన్ (సీడీయూ) అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.
ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లే క్రిస్టిన్ డెమక్రటిక్ యూనియన్ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్‌లు 33శాతం ఓట్లతో 238 స్థానాల్లో విజయం సాధించాయి. ఆమె ప్రధాన ప్రత్యర్థి మార్టిన్ స్కల్జ్ ప్రాతినిధ్యం వహించిన సోషల్ డెమక్రటిక్ పార్టీ 148 సీట్లను సాధించి ద్వితీయ స్థానంలో ఉంది.

శరణార్థులకు ఆశ్రయం కల్పించడాన్ని వ్యతిరేకించిన ఏఎఫ్‌డీ పార్టీ 13.5శాతం ఓట్లు సాధించి 95 సీట్లలో విజయం సాధించి పరిశీలకుల్ని ఆశ్చర్యపర్చింది. జర్మనీ ఫెడరల్ బాడీ అయిన బుండెస్టాగ్‌లోకి ప్రవేశించింది.
ఇక వ్యాపారులకు మద్దతుగా నిలిచే ఎఫ్‌డీపీ 10 శాతం ఓట్లతో 80 సీట్లు సాధించింది. గ్రీన్స్‌పార్టీ 9 శాతం ఓట్లతో 67 సీట్లు సాధించింది. ఈసారి సీడీయూ ఎఫ్‌డీపీ , గ్రీన్స్‌పార్టీలోతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఏంజెలా మెర్కెల్‌కు మెజార్టీ బాగా తగ్గింది. ఈసారి ఎస్‌డీపీ, ఏఎఫ్‌డీలు ప్రతిపక్షంలో ఉండనున్నాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications