Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొజాంబిక్ దగ్గర్లో ఎంహెచ్ 370 విమాన శకలాలు!

వాషింగ్టన్: రెండేళ్ల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన శకలాలు పశ్చిమ ఆఫ్రికా తీరంలో దొరికే అవకాశం ఉందని ఎన్బీసీ వార్తా సంస్థ వాషింగ్టన్‌లోని తన నివేదికలో వెల్లడించింది. ఆ విమాన శకలాలు ముజాంబిక్, మెడగాస్కర్ మధ్య లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆ ప్రాంతంలో ఎంహెచ్ 370 విమాన శిథిలాలకు సంబంధించిన చిత్రాలను అమెరికా, మలేషియా, ఆస్ట్రేలియా నావికులు గుర్తించినట్లుగా తెలిపింది. ఈ ప్రాంతంలో ఎంహెచ్ 370కి చెందిన పొడవైన విభాగానికి చెందిన వస్తువును ఎన్బీసీ పేర్కొంది.

MH370 Search: Possible Debris Found Near Mozambique, Says Report

అయితే ఈ నివేదికను రాయటర్స్ ధృవపరచలేదు. మొజాంబిక్ అధికారులు కూడా.. ఆ ప్రాంతంలో విమాన శిథిలాలు దొరికినట్లు సమాచారం లేదని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

కాగా, 2014 మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తూ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విమానంలో 225 మంది ప్రయాణీకులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+