వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైకేల్ జాక్సన్ వాటాను కొనుగోలు చేసిన సోనీ

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: దివంగత పాప్‌స్టార్‌ మైకేల్‌ జాక్సన్‌కు సోనీ- ఏటీవీ పబ్లిషింగ్‌ వెంచర్‌లో ఉన్న వాటాను 750 మిలియన్‌ డాలర్లకు సోనీ కంపెనీ కొనుగోలు చేసింది. సోనీ, మైకేల్‌ జాక్సన్‌లు సంయుక్తంగా 1995లో సోనీ-ఏటీవీను ఏర్పాటు చేశారు.

ఈ సంస్థలో జాక్సన్‌కు 50శాతం వాటా ఉంది. వీరి సంస్థకు పాప్‌స్టార్స్‌ వైక్లిఫ్‌ జీన్‌, టేలర్‌ స్విఫ్ట్‌లతో సహా పలువురు గాయకుల ఆల్బమ్‌లపై కాపీరైట్లు లభిస్తాయి.

Michael Jackson's slice of Beatlemania goes to Sony in $750 million deal

గత సంవత్సరం వీరి ఒప్పందంలో ఓ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం సోనీ.. జాక్సన్‌ వాటాను కొనుగోలు చేయడానికి అవకాశం లభించింది. అప్పట్లో ఏటీవీ ప్రముఖ పాప్‌స్టార్ల మ్యూజిక్‌ కాపీరైట్లను 41.5 మిలియన్లకు కొనుగోలు చేసింది.

'మైఖెల్‌ జాక్సన్‌ ఎస్టేట్‌ విలువ పెంచడానికి, ఆయన పిల్లలు లబ్ధి పొందడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది' అని మైకేల్‌ జాక్సన్‌ ఎస్టేట్‌ కో ఎగ్జిక్యూటర్స్‌ బ్రాంకా, మెక్లేన్‌లు తెలిపారు. మ్యూజిక్ హిస్టరీలో ఇదో పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని అభిప్రాయపడ్డారు.

English summary
Sony is taking control of one of music's crown jewels: a vast publishing catalog that includes many Beatles songs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X