సౌదీ రాజుకు సంతాపం: మిషెల్‌పై ట్విట్టర్‌లో విమర్శలు (ఫోటో)
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులపై ట్విట్టర్‌లో విమర్శలు హల్ చల్ చేస్తున్నాయి. కారణం సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో ఆయనకు సంతాపం తెలిపే క్రమంలో ఆనవాయితీ ప్రకారం మహిళలు తమ తల భాగం కనిపించకుండా వస్త్రాన్ని ధరించాలి.
ఆ ఆనవాయితీ ఫస్ట్ లేడీ మిషెల్‌కు తెలియదో ఏమో కానీ తల భాగంపై వస్త్రాన్ని ధరించలేదు. దీంతో మిషెల్ ఒబామా తమ సాంప్రదాయాన్ని గౌరవించలేదని ఆందోళనలు చేపట్టారు. ఈ విషయం గురించి ట్విట్టర్‌లో కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఐతే ఈ సాంప్రదాయంపై విదేశీయులకు మినహాయింపు ఉందని కూడా మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

ట్విట్టర్‌లో ఇప్పటికే సుమారు 1500 ట్వీట్లు #Michelle_Obama_unveiled ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇండోనేషియా పర్యటనలో మిషెల్ ఒబామా తలపై వస్త్రం ధరించిందని కానీ సౌదీకి వచ్చినప్పుడు అలా చేయలేదని తీవ్రంగా విమర్శిస్తూ ఫోటోలతో సహా ట్వీట్స్ చేస్తున్నారు.
واشناراه وادويشاه#ميشيل_أوباما_سفور في بلد التوحيدوفي أندونيسيا بحجابهاالله أكبر والعزةلله@mshanarm @s_a_aldweesh pic.twitter.com/KvGTO2hgG9
— نورة العتيبي (@Riyadh_K_S_A) January 27, 2015 ఇక సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా జనవరి 23 నాడు మరణించిన విషయం తెలిసిందే. భారత్‌కు మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక రోజు మిగిలి ఉండగానే తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని, కింగ్ అబ్దుల్లా అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం తెలియజేయడానికి సౌదీ అరేబియా వెళ్లిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications