భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహం
వాషింగ్టన్: గత కొద్ది రోజులుగా భారత సరిహద్దుల వద్ద చైనా తన బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని అమెరికా 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' మైక్ పాంపియో వ్యాఖ్యానించారు.
Recommended Video

డ్రాగన్ దుశ్చర్యలపై..
ఓ వైపు భారత్‌కు మద్దతు తెలుపుతూ.. డ్రాగన్ దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు పాంపియో. ఇటీవల తూర్పు లడఖ్, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో వాస్తవధీన రేఖ వెంట భారత్-చైనా సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. అంతేగాక, తరచూ చైనా దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

చైనా తీరుపై మండిపాటు..
ఈ నేపథ్యంలోనే చైనా దుందుడుకు వ్యవహారాన్ని పాంపియో తప్పుబట్టారు. అలాగే, హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, కరోనా సృష్టి, వ్యాప్తి అంశాలను ప్రస్తావించిన ఆయన.. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత సరిహద్దుల్లో బలగాల మోహరింపును చైనా కొనసాగిస్తూనే ఉందని పాంపియో చెప్పారు.

చైనా అంతే... కానీ అమెరికాకు ఆ సత్తా ఉంది..
కరోనావైరస్ విషయంలో ప్రపంచానికి నిజాలు తెలియజేయడంలోనూ ఇంకా ఉదాసీనంగానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేందుకు సిద్దమైందన్నారు. ఈ అంశాలు చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవహార శైలికి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమేనన్నారు పాంపియో. అంతేగాక, మేధో హక్కులను కొల్లగొట్టడం, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఇంకా ప్రయత్నిస్తుండటం వారి నియంతృత్వ పోకడలకు నిదర్శనమని దుయ్యబుట్టారు. చైనా యత్నాలను నిరోధించాల్సిన సామర్థ్యం అమెరికాకు ఉందని అన్నారు.

డ్రాగన్ తీరు మారడం లేదు..
కాగా, చైనా గత కొన్నేళ్లుగా అదే వైఖరిని అవలంభిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేగాక, వివిధ ప్రాంతాల్లో చైనా తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోందని తెలిపారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట వివిధ ప్రాంతాల్లో నౌకాశ్రయాల్ని నిర్మిస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇవన్నీ తమ నావికా స్థావరాలుగా మార్చుకునేందుకు వ్యూహాలు పన్నుతోందని మండిపడ్డారు.

వివాదాలకు చైనా ముగింపు పలకాలి..
యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫారేన్ ఎఫైర్స్ కమిటీ చీఫ్ ఎల్లయెట్ ఏంజెల్ మాట్లాడుతూ.. భారత సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట చైనా దుందుడుకు చర్యలు ఎంతమాత్రం సరికాదన్నారు. చైనా.. దౌత్య నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ చైనా వ్యవహరించాలన్నారు. భారత్‌తో సరిహద్దు వివాదానికి ముగింపు పలకాలని అన్నారు. కాగా, చైనా, భారత్ వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను ఇరు దేశాలు కూడా తిరస్కరించడం గమనార్హం.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!!












Click it and Unblock the Notifications