పాక్ లో వైమానిక దాడులు: ఉగ్రవాదులు అంతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యం గుట్టుచప్పుడు కాకుండా వైమానిక దాడులలో జరిపి ఆ దేశంలో ఉగ్రవాదులను అంతం చేస్తున్నది. పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులలో 15 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు.
పాకిస్థాన్ లోని ఉత్తర వజిరిస్థాన్ లోని గిరిజన ప్రాంతాలలో ఉగ్రవాదులు మకాం వేశారు. ఈ గిరిజన ప్రాంతాలలో తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్, లష్కర్-ఏ-ఇస్లామ్ (ఎల్ఐ) ఉగ్రవాదుల ప్రభావం చాల ఎక్కువగా ఉంది.

ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ లోని పలు ప్రాంతాలలో దాడులకు పాల్పడ్డారు. ఆదివారం పాకిస్థాన్ సైన్యం పాక్ - అఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజిరిస్థాన్ ప్రాంతంలో వైమానికదాడులు నిర్వహించింది. ఉగ్రవాదులు ఎదురు దాడులకు పాల్పడకుండా జాగ్రతలు తీసుకున్నారు.
ఈ వైమానిక దాడులలో 15 మంది ఉగ్రవాదులు అంతమయ్యారని పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే మరణించిన వారిలో ఉగ్రవాద నాయకులు ఉన్నారా, లేదా అని ఆరా తీస్తున్నామని అక్కడి అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications