వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడులే లక్ష్యం.. మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్‌లో పర్యటన

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగే యాంబిషన్‌ ఇండియా ఫోరం సమావేశంలో కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రెంచ్‌ సంబంధాలు అభివృద్ధి అంశాలపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకుంన్నారు. ఇరు దేశాలకు చెందిన 7 వందల మందికి పైగా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు, 4వందలకు పైగా కంపెనీల అధిపతులు, ప్రతినిధులు పాల్గొంటారు.

ఐదు రోజుల టూర్‌లో భాగంగా గురువారం మిస్సైల్స్‌ ఎంబీడీఏ కంపెనీ ప్రతినిధులు, ఏరో క్యాంపస్‌ అక్విటిన్‌ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ఫ్రాన్స్ లోని భారత రాయబారి జావెద్‌ అష్రఫ్‌తో భేటీ అయ్యారు. ఫ్రెంచ్‌ కంపెనీలకు అవకాశం ఉన్న రంగాల గురించి వివరించారు.

పారిస్‌లో కాస్మోటిక్‌ వ్యాలీ డిప్యూటీ సీఈఓ ఫ్రాంకీ బెచెరోతోనూ సమావేశం జరిగింది. భారత్‌లో సౌందర్య సాధనాల మార్కెట్‌, గణనీయమైన వృద్ధితో పాటు తెలంగాణలో కాస్మోటిక్‌ తయారీకి ఉన్న అవకాశాలను వివరించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో మంత్రి కేటీఆర్ బృందం సమావేశమవుతూ బిజీగా సాగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారికి వివరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రంగాల్లో సాధించిన విజయాలను వారికి వివరించింది.

 minister ktr visits france

Recommended Video

బీజేపి కార్యాలయంలో బండి సంజయ్ దీక్షను తప్పుబట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి || Oneindia Telugu

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్‌ను కేటీఆర్ బృందం పరిశీలించింది. వీ హబ్, టీ వర్క్స్, టీ హబ్ వంటి తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ సంస్థలతో సహకారం గురించి వివరించారు. వాస్తవానికి రైల్వే డిపోగా ఉన్న ఈ కేంద్రాన్ని ఇంక్యుబేటర్‌గా మార్చారు. ఏడీపీ ఛైర్మన్, సీఈవో అగస్టిన్ డి రోమనెట్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. దేశంలో విమానయానరంగంలో ఉన్న అవకాశాలను కేటీఆర్ వారికి వివరించారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి అవసరాన్ని వారికి తెలిపారు. ఫ్రాన్స్ లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్ మూవ్ మెంట్ ఆఫ్ ఎంటర్ ఫ్రైజెస్ ఆఫ్ ప్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో మంత్రి కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. తెలంగాణలో పెట్టబడి అవకాశాలను వారికి వివరించారు.

English summary
telangana minister ktr visits france. he meets ceo and industrialists for Investment in the telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X