అమెరికాలో మరోసారి కాల్పులు.. ఆరుగురు మృతి
అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. తూర్పు మిసిసిపిలోని మూడు వేర్వేరు చోట్ల ఈ కాల్పులు జరిగాయి. క్లే కౌంటీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో కాల్పులు జరిగాయి. మూడు వేర్వేరు ప్రాంతాలే లక్ష్యంగా కాల్పులు జరిగాయి. అయితే క్లే కౌంటీలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

స్థానిక సమయం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ దాడులకు పాల్పడిన దుండగుడ్ని అరెస్ట్ చేసినట్లు క్లే కౌంటీ షెరిఫ్ ఎడ్డీ స్కాట్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ మాధ్యమం వేదికగా ఘటన జరిగిన విధానాన్ని తెలిపారు. ఇక క్లే కౌంటీ ప్రాంతం నార్త్ ఈస్టెర్న్ మిసిసిపి రాష్టంలో ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 20 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే గతేడాది అక్టోబర్ లోనూ ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 12 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications