శతాబ్దం నాటి పురాతన హిందూ దేవాలయ విధ్వంసం .. నిప్పటించి అల్లరిమూక వీరంగం
పాకిస్తాన్లో హిందూ దేవాలయాన్ని విధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. వాయువ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని కరాక్ జిల్లాలోని టెర్రీ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో జమాత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ కు చెందిన మతాధికారులు రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రారంభించిన కాసేపట్లోనే ఆగ్రహంతో ఊగిపోయిన అల్లరిమూకలు ఒక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇక ఆలయ విధ్వంసానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పాకిస్తాన్ లో దారుణం .. హిందూ ఆలయ విధ్వంసం
వాయువ్య పాకిస్తాన్లో ఒక శతాబ్దం నాటి హిందూ దేవాలయంపై దాడి చేసిన అల్లరి మూక రెచ్చిపోయారు. తొలుత ఆలయ గోడలు కూల్చిన వారు , ఆపై నిప్పంటించిన ఘటన నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు . ఈ దాడిలో పాల్గొన్నారనే అనుమానంతో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు చీఫ్ ఇర్ఫానుల్లా ఖాన్ తెలిపారు.
దేవాలయం పై దాడికి, తమ మత ప్రసంగాలకు, ర్యాలీకి ఎటువంటి సంబంధం లేదని జమాత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ మతాధికారులు వెల్లడించారు.
1900 వ సంవత్సరంలో నిర్మించిన ఆలయం .. కూల్చేసిన పాకిస్తానీలు
ఈ ఆలయం మొట్టమొదట 1900 ల ప్రారంభంలో ఒక పుణ్యక్షేత్రంగా నిర్మించబడింది, కాని స్థానిక హిందూ సమాజం 1947 లో అక్కడ నుండి వెళ్ళిపోయింది . భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారత్-పాకిస్తాన్ విడిపోయిన తర్వాత హిందూ సమాజం అక్కడినుండి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. 1997 నాటికి ఈ స్థలాన్ని స్థానిక ముస్లింలు స్వాధీనం చేసుకున్నారు. అతి పురాతన ఆలయాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొందరు ఆందోళన వ్యక్తం చేశారని, అందులో భాగంగానే మొత్తంగా దేవాలయాన్ని కూల్చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

హిందువుల మనోభావాలను కించ పరిచారు అనే ఆవేదన
దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘవిద్రోహ శక్తుల దేవాలయంపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన లాల్ చంద్ మహ్లీ ఈ ఘటన పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. పాకిస్తాన్ లో ఉన్న అతి పురాతన హిందూ దేవాలయంపై దాడి ఘటనతో హిందువుల మనోభావాలను కించ పరిచారు అనే ఆవేదన వ్యక్తమవుతోంది.
పాకిస్తాన్ లోని అతి పురాతన ఆలయంపై జరిగిన దాడిలో ఆలయం బాగా ధ్వంసం అయినట్టు తెలుస్తుంది .