ఇండోనేషియాలో భూకంపం: తీవ్రత 6.0గా నమోదు
జకార్తా: ఇండోనేషియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దాని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ మేరకు ఇండోనేషియా వాతావరణ, జియో ఫిజిక్స్ ఎజెన్సీ అధికార ప్రతనిధి మాట్టాడుతూ.. ప్రస్తుతం సంభవించిన భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.
సునామీ సృష్టించేంత తీవ్రంగా భూకంపం సంభవించకపోయినప్పటికీ ప్రజలను భయాందోళనకు గురిచేసే స్థాయిలో భూమి పలుసార్లు కంపించిందని చెప్పారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్ లోని సంఘీ ద్వీపానికి 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

ఇరాక్‌లో వైమానిక దాడులు: 71మంది మృతి
ఇరాక్‌లో సైన్యం వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన అన్బార్, నినేవ్, సలాహుదీన్ ప్రావిన్స్‌లలో వైమానిక దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ దాడుల్లో 71మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఉగ్రవాదులతోపాటు పలువురు సైనికులు, సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications