బ్లాక్ స్టోన్ సీఈవోతో మోడీ మీట్: దేశంలో పెట్టుబడులకు వెల్‌కం.. ఇవీ వసతులు...
అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీ బిజీగా ఉన్నారు. టాప్ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. బ్లాక్ స్టోన్ కంపెనీ సీఈవో స్టీఫెన్‌తో మీట్ అయిన మోడీ.. ఆర్థిక సహకారం కోరారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని.. అన్నీ వసతులు సౌకర్యాలు కల్పిస్తామని మాట ఇచ్చారు.
తమ దేశంలోకి వచ్చే కంపెనీలకు మౌలిక వసతుల కల్పన అందజేస్తామని మోడీ తెలియజేశారు. అలాగే ప్రభుత్వ పరంగా రాయితీలు కూడా ఇస్తామని చెప్పారు. దేశంలో తమకు ఆర్థికంగా సహకారం అందజేయాలని కోరారు. మౌలిక వసతుల కల్పన, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు స్టీపెన్ సానుకూలంగా ఉన్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం అవుతారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో మోడీ వెల్లడించారు.
ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు.
Recommended Video
అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్తాన్ అనుమతించింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళితే తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాక్ నిరాకరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ ధోరణిపై భారత్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌లో తన నిరసన గళాన్ని వినిపించింది. అఫ్గానిస్తాన్ గగనతలం సురక్షితం కాదు కాబట్టి ఈసారి ప్రధాని మోడీ విమానానికి పాక్ అనుమతించింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications