Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మామ్ సక్సెస్: పాక్ స్పందన, భారత్‌కే కాదని చైనా

ఇస్లామాబాద్/బీజింగ్: మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయం పైన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలు స్పందించాయి. ఇది భారత్‌కు, ఆసియాకు గర్వకారణమని, అంతరిక్షంలో మానవ పరిశోధనలోనూ ఇది చిరస్మరణీయమైన మైలు రాయి అని, దీనిని సాధించిన భారత్‌కు శుభాకాంక్షలని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ అన్నారు.

భారత్ సాధించిన ఈ విజయం కేవలం ఆ దేశానికి మాత్రమే కాదన్నారు. ఆసియా పురోగతికి మైలురాయి అన్నారు. తాము ప్రపంచ దేశాలతో కలిసి పని చేయాలనుకుంటున్నామని, శాంతియుత అభివృద్ధి జరగాలని, అంతరిక్ష పరిశోదనల్లో పురోగతి సాధించాలన్నారు.

MOM success draws praise from Pakistan

ఊహించని విజయమని పాకిస్తాన్ పేర్కొంది. మామ్ ప్రయోగం విజయం సాధించినందున పాకిస్తాన్ శుభాకాంక్షలు తెలిపింది. మనం ఇప్పటికీ సోషల్ సమస్యలతో బాధపడుతున్నామని, కరప్షన్, బంధుప్రీతి తదితరాలు అభివృద్ధి నిరోధకాలుగా అవుతున్నాయని, మనం ఇంకా ఎప్పుడు మేల్కొంటామని, మనం పొరుగు వారిని చూడాలని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+