ఏడుగురి కంటే ఎక్కువమందితో సెక్స్ సంబంధాలు ఉంటే క్యాన్సర్ రావొచ్చు
సిడ్నీ : ఏడుమంది లేదా అంతకంటే ఎక్కువ మహిళలతో సెక్స్ సంబంధాలు కలిగి ఉన్న పురుషులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎక్కువ మందితో శృంగారాన్ని నెరిపే వారు జాగ్రత్తలు తీసుకొన్నా క్యాన్సర్ వ్యాధి నుండి తప్పించుకోలేరని వారు చెబుతున్నారు.
ఒకరు లేదా ఏడుమంది కంటే ఎక్కువమంది మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అస్ట్రేలియాకు చెందిన క్యాన్సర్ కౌన్సిల్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ మేరకు వారు తాము నిర్వహించిన అథ్యయనానికి సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు.
ఎక్కువ మంది మహిళలతో జరిపే లైంగిక సంబంధాల్లో హరోన్ల మార్పులు చోటుచేసుకొంటాయని చెప్పారు. లైంగిక చర్య, జీవక్రియ మార్పు పురుషుల హార్మోన్లపై ప్రభావం చూపుతాయని ఆ పరిశోధన పత్రంలో చెప్పారు.

మరో విచిత్రమేమిటంటే యుక్త వయస్సు నుండి లైంగిక కార్యకలాలపాల్లో పాల్గొంటున్న వారికి కూడ ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధన పత్రంలో చెప్పారు. వంశపారంపర్యంగా కూ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వారు గుర్తించారు.
తండ్రికి లేదా కుటుంబ యజమాని లేదా కుటుంబ పెద్దకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే వారి వారసులకు కూడ వచ్చే అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు. అధికబరువున్న వారికి కూడ క్యాన్సర్ రావచ్చని, అయితే కొద్దమందికి మాత్రమే ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వారు వివరించారు.
ఏడుమంది లేదా అంతకంటే ఎక్కువ మహిళలతో సెక్స్ సంబంధాలు కలిగి ఉన్న పురుషులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎక్కువ మందితో శృంగారాన్ని నెరిపే వారు జాగ్రత్తలు తీసుకొన్నా క్యాన్సర్ వ్యాధి నుండి తప్పించుకోలేరని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications