బాహుబలి శివగామిలా: కొడుకు కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి

లాస్ ఏంజిల్స్: బాహుబలి సినిమాలో శివగామి (రమ్యకృష్ణ) బాహుబలిని (ప్రభాస్) కాపాడేందుకు.. అతనిని తన చేతులతో పైకెత్తి పట్టుకొని, ఆమె మాత్రం నీట మునిగి చనిపోతుంది. ఈ సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది.

అయితే, దాదాపు ఇలాంటి హృదయ విదార సంఘటన నిజంగానే జరిగింది. అచ్చం సినిమాలో వలె ప్రమాదంలో చిక్కుకున్న ఓ మహిళ తన ప్రాణాలు పోతున్నా.. తన కొడుకు మాత్రం బతకాలనుకుంది. శివగామిలాగే కొడుకును ఎలాగోలా ఒడ్డుకు చేర్చి ఆమె మాత్రం ప్రాణాలను విడిచింది.

ఈ సంఘటన ఇటీవల అమెరికాలోని కొలరాడోలో జరిగింది. నీళ్లలో పడిన రెండేళ్ల వయసు కొడుకును కాపాడుకునే క్రమంలో ఓ తల్లి తన ప్రాణాలను విడిచింది. తాను మునిగిపోతూ కూడా తన బిడ్డను అలాగే నీళ్లపై తేలే విధంగా ఎత్తి పట్టుకుంది.

Mother dies saving 2 year old son who slipped off houseboat

ఛెల్సీ రస్సెల్ అనే 33 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కుమారుడితో కలిసి పోవెల్‌ సరస్సులోని ఓ హౌస్ బోట్‌లో విహారయాత్రలో భాగంగా కుటుంబంతో సహా విడిది చేసింది. ఈ సమయంలో ఆమ కొడుకు నీళ్లలో పడిపోయాడు.

వెంటనే చెల్సీ రస్సెల్ నీళ్లలకి దూకింది. అదే సమయంలో హౌస్ బోట్‌ను ఆపేసరికే తల్లీబిడ్డలకు అది చాలా దూరంగా వచ్చేసింది. ఈ లోగా ఛెల్సీ కుటుంబ సభ్యుడొకరు ఓ చిన్న పడవను వారి వద్దకు తీసుకు వచ్చారు. తల్లి ఛాతీపై ఉన్న బిడ్డను, నీళ్లలో అపస్మారకంగా పడి ఉన్న ఛెల్సీని పైకి తెచ్చారు. అయితే, ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+