అదుపు తప్పిన ల్యాండింగ్ - గాల్లోనే విమానాలు ఢీ

వాషింగ్టన్: అమెరికాలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య అధికారికంగా తెలియరావట్లేదు. ముగ్గురు మరణించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

రెండు తేలికపాటి విమానాలు భూమికి 200 మీటర్ల ఎత్తులో గాల్లోనే ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. పసిఫిక్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 2:36 నిమిషాలకు కాలిఫోర్నియాలోని వాట్సన్‌‌విల్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు కూడా సెస్నా రకానికి చెందినవి. ఒకటి సింగిల్ ఇంజిన్, మరొకటి డబుల్ ఇంజిన్‌తో నడిచేవి.

Multiple fatalities reported after two planes collide at Watsonville in California

ప్రమాద సమయంలో సెస్నా 152లో ఇద్దరు, సెస్నా 340 ఎయిర్‌క్రాఫ్ట్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపుగా ఒకే సమయానికి పైలెట్లు ల్యాండింగ్ కోసం ప్రయత్నించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అధికారులు అంచనా వేశారు. అనుకున్న విధంగా వాటిని ల్యాండ్ చేయకపోవడం, వేగాన్ని అంచనా వేయడంలో విఫలం కావడం ప్రమాదానికి దారి తీసి ఉంటాయని పేర్కొంటున్నారు.

ప్రమాదం తీవ్రతకు ఒక తేలికపాటి విమానం ఎయిర్‌పోర్ట్‌కు దూరంగా కుప్పకూలింది. మరొకటి విమానాశ్రయంలోని హ్యాంగర్ వద్ద ధ్వంసమైంది. పెద్ద శబ్దంతో విమానాలు ఢీ కొట్టుకున్నాయని వాట్సన్‌విల్లే ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. దట్టమైన పొగను వెలువడిందని, శకలాలు విసిరేసినట్లుగా చెల్లాచెదురుగా పడ్డాయని చెప్పారు. అందులో ప్రయాణించిన వారెవ్వరూ జీవించి ఉండే అవకాశం లేదని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+