చైనా కోసం.. సీక్రెట్ ఆపరేటింగ్ సిస్టం సిద్ధం చేస్తున్న మైక్రోసాఫ్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైనా కోసం ప్రత్యేకంగా, రహస్యంగా చేస్తున్న ఓ పని ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. జూలై 29, 2015న మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్-10ను ప్రపంచ మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మైక్రోసాఫ్ట్ విండోస్-10 ఆపరేటింగ్ సిస్టంను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్లమంది వినియోగిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఈ వెర్షన్‌ను వినియోగిస్తున్నా చైనాలో మాత్రం దీనికి చోటులేకుండా పోయింది.

Mystery surrounds secret new version of Windows 10 created for the Chinese government

ఇందులో భద్రతాపరమైన లోపాలున్నాయంటూ చైనా దీనికి తమ దేశంలో వాడకానికి అనుమతి నిరాకరించింది. తాము చెబుతున్న మార్పులతో కొత్త వెర్షన్‌ను రూపొందిస్తేనే అనుమతిస్తామని తేల్చి చేప్పడంతో చైనాకు దూరం కావడం ఇష్టంలేక మైక్రోసాఫ్ట్ చైనా డిమాండ్‌కు అంగీకరించింది.

ప్రస్తుతం చైనా కోసం ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలతో కూడిన విండోస్-10ను రహస్యంగా అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుత విండోస్-10లో ఉన్న ఫీచర్లతో పోలిస్తే చైనా కోసం అభివృద్ధి చేస్తున్న ఈ రహస్య వెర్షన్‌లో భద్రతా ప్రమాణాలతోపాటు మరెన్నో మెరుగైన ఫీచర్లు ఉన్నాయట. అయితే ఈ వెర్షన్‌ను అందరూ ఉపయోగించడానికి వీలుండదని, ఒక్క చైనాకు మాత్రమే ఇది పరిమితమని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a move that is bound to raise eyebrows, Microsoft has launched a a specially modified version of Windows 10 for use by the Chinese government. The customised operating system is expected to have beefed up security, to counter reported threats from the American security services. Its exact features, however, remain unclear. But some may be concerned whether the software giant has been put under pressure to include more draconian tools for use by the notoriously strict Chinese regime.
Please Wait while comments are loading...