ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మోడీ ఫోన్ సంభాషణ: ఏమన్నారంటే?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నెతన్యాహు.. మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు.
యుద్ధం నివారణ గురించి ఆలోచించాలని ప్రధాని మోడీ సూచించారు. బందీల విడుదల, కాల్పుల విరమణ గురించి భారత్ మానవతా సహాయం చేస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారని ప్రధానమంత్రి కార్యాలయంలో ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఓ వైపు, ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు, మరోవైపు ఇరాన్ పరస్పర దాడులతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. అంతేగాక, యుద్ధం నుంచి వెనక్కి తగ్గితే దేవుడు కూడా క్షమించడని ఇరాన్ పేర్కొనడం గమనార్హం.
Prime Minister Narendra Modi spoke with Prime Minister of Israel Benjamin Netanyahu.
— ANI (@ANI) August 16, 2024
PM Netanyahu conveyed his warm wishes on India’s 78th Independence Day. The two leaders discussed the prevailing situation in West Asia. PM Modi emphasizes the need for de-escalating the… pic.twitter.com/iZuFNR867d
హమాస్ అగ్రనేత హానియే హత్య అనంతరం ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగాయి. మరోవైపు, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గాజాలో ఇప్పటి వరకు వందలాది మంది ఉగ్రవాదులతోపాటు సామాన్య ప్రజలు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుతో ప్రధాని మోడీ ఫోన్ చేసి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దేశాల మధ్య శాంతియువత వాతావరణం నెలకునేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తామని భారత్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications