వాటి గురించి మాట్లాడకుండా ఉంటే.. నవాజ్ షరీఫ్ రూ.1000 కోట్లు ఇస్తానన్నారు: ఇమ్రాన్ ఖాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: ప‌నామా పేపర్ల విష‌యంపై మాట్లాడ‌కుండా ఉంటే రూ.1000 కోట్లు ఇస్తానని ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్‌ తనను ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారంటూ ప్రతిపక్ష పార్టీ తెహ్రెక్-ఇ-ఇన్‌సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.

ప‌నామా పేపర్లు బ‌య‌ట‌పెట్టిన అక్రమార్కుల జాబితాలో పాకిస్తాన్ ప్ర‌ధానమంత్రి న‌వాజ్ ష‌రీఫ్ పేరుంద‌ని, ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని ఇమ్రాన్‌ ఖాన్ డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే.

imran-khan-nawaj-sharif

ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రలోభంపై ఇమ్రాన్ ఖాన్ మాట్లడుతూ.. పంజాబ్‌ ముఖ్యమంత్రి స్నేహితుడయిన ఒకరు రెండు వారాల క్రితం తనను కలసి ఈ విషయంపై మాట్లాడార‌ని వ్యాఖ్యానించారు.

ఈ వెయ్యి కోట్ల రూపాయల ఆఫర్‌ మాత్రమేకాక, షరీఫ్‌ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తే మున్ముందు మ‌రింత ఇస్తామ‌ని షరీఫ్ ఆ వ్యక్తితో తనకు చెప్పించార‌ని కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అయితే, ఇమ్రాన్ అన్నీ అవాస్త‌వాలు మాట్లాడుతున్నార‌ని పంజాబ్ సీఎం షాబాజ్‌ షరీఫ్ అన్నారు. తాను ఈ విషయాన్ని కోర్టులో సవాల్‌ చేస్తానని పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Islamabad: Pakistan opposition leader Imran Khan made sensational comments on Prime Minister Nawaj Sharif on Friday that he offered Rs.1000 Crores to calm down regarding Panama Papers Case. He said that punjab cm sent a person to him regarding this deal. “I demand that Sharif should resign immediately as he has lost moral authority to rule the country,” Khan, who heads the Pakistan Tehreek-e-Insaf, said at a press conference in Islamabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి