రంగంలోకి పాక్ మాజీ ప్రధాని - అనూహ్య ప్రతిపాదన, సీన్ ఛేంజ్..!?
ఆపరేషన్ సింధూర్ వేళ పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రపంచ దేశాల నుంచి పాక్ పైన ఒత్తిడి పెరుగుతోంది. భారత్ పైన పాక్ డ్రోన్ లతో దాడికి ప్రయత్నిస్తోంది. పాక్ ప్రయత్నాలను భారత్ సైన్యం ధీటుగా తిప్పి కొడుతోంది. ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ను అనుక్షణం పర్యవేక్షిస్తూ .. అటు నిరంతర సమీక్షలతో దిశా నిర్దేశం చేస్తున్నారు. కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధాని సోదరుడు.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రంగంలోకి వచ్చారు. కీలక ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పాక్ తదుపరి చర్యలు ఏంటనేది కీలకంగా మారుతోంది.
నవాజ్ కీలక ప్రతిపాదన
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు పాక్ జమ్ముతో సహా పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. భారత్ సమర్దతంగా వాటిని నిర్వీర్యం చేసింది. పాక్ పైన ఒత్తిడి పెరుగుతోంది. పైకి మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల పాక్ ఎంపీలతో సహా సైన్యం గగ్గోలు పెడుతోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కీలక సూచనలు చేశారు. భారత్ తో దూకుడు వ్యవహరించవద్దని, దౌత్యమార్గాల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. భారత్ తో సంప్రదింపులు జరిపేందుకు వ్యక్తిగతంగా నవాబ్ షరీఫ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా లో కథనాలు ప్రసారం అవుతున్నాయి.

పాక్ ఉక్కిరిబిక్కిరి
భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. దీంతో, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు సహా అధికార పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అధ్యక్ షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. ప్రభుత్వంలో ఎటువంటి పదవీ లేకు న్నా, కేవలం అధికార పార్టీ అధ్యక్షుడి హోదాలో నవాజ్ షరీఫ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవాజ్'భారత్‌తో దూకుడుగా వ్యవహరించవద్దని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలి' అని తన సోదరుడు, పాక్ పీఎం అయిన షెహబాజ్ షరీఫ్‌కు సూచించినట్లు సమాచారం. అంతకాదు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేసేందుకు లండన్ నుంచి నవాజ్ షరీఫ్ వచ్చారని, ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
కార్గిల్ యుద్దం వేళ
1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. నవాజ్ షరీఫ్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. భారత్ చర్యలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. భారత్ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని ఆయన ఆరోపించారు. నవాజ్ మాత్రం, దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని ప్రధానికి సూచించినట్లు తెలుస్తోంది. భారత్ మాత్రం పాక్ తో ఎలాంటి దౌత్య పరమైన చర్చలకు అవకాశం లేదని తేల్చి చెబుతోంది.












Click it and Unblock the Notifications