హిమాలయాల్లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం

Nepal Earthquake: నేపాల్‌లో పెను భూకంపం సంభవించింది. హిమాలయాల రీజియన్ పరిధిలోని లొబుచే ప్రాంతం దీనికి కేంద్రబిందువు. దీని తీవ్రత భారత్‌లోనూ కనిపించింది. నేపాల్‌కు ఆనుకుని వుండే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బిహార్‌లల్లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి.

నేపాల్ హిమాలయన్ రీజియన్‌లో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా రికార్డయింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 6:35 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. లొబుచేకు ఈశాన్య దిశగా 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

Nepal Earthquake Magnitude 7 1 Hits Lobuche in Nepal Tremors Felt in India

ఉపరితలం నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దిగవన టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. లొబుచే రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఉన్నపళంగా ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. రోడ్ల మీదే గడుపుతున్నారు. ప్రధాన భూకంపం తరువాత తక్కువ స్థాయిలో ప్రకంపనలు సంభవిస్తోండటంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. చలిలోనూ ఆరుబయటే ఉంటోన్నారు. ప్రాణనష్టం సంభవించిందా? లేదా? అనేది ఇప్పటివరకు తెలియరాలేదు.

ఈ భూకంప తీవ్రత అటు మనదేశంలోనూ కనిపించింది. నేపాల్, హిమాలయన్ రీజియన్‌కు ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంత జిల్లాలు, సిక్కిం, బిహార్‌లల్లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. భారత్- నేపాల్ సరిహద్దుల్లో ఉండే పలు ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదయ్యాయి.

ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఉన్నపళంగా ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. రోడ్ల మీదే గడుపుతున్నారు. ప్రధాన భూకంపం తరువాత తక్కువ స్థాయిలో ప్రకంపనలు సంభవిస్తోండటంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. చలిలోనూ ఆరుబయటే ఉంటోన్నారు. ప్రాణనష్టం సంభవించిందా? లేదా? అనేది ఇప్పటివరకు తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+