వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ విమాన ప్రమాదం: నలుగురు భారతీయులతోపాటు ప్రయాణికులంతా మరణించారు, 14 మంది మృతదేహాల వెలికితీత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో ఆదివారం కూలిపోయిన విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు. నలుగురు భారతీయులు సహా 22 మందితో కూలిపోయిన తారా ఎయిర్‌లైన్స్ విమానం శిథిలాల నుంచి 14 మృతదేహాలను భద్రతా దళాలు సోమవారం బయటకు తీశారు.

ఆదివారం ఉదయం కుప్పకూలిన ప్రయాణీకుల విమాన శకలాలు వాయువ్య నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలోని థాసాంగ్‌లోని సనో స్వరే భీర్‌లో 14,500 అడుగుల ఎత్తులో కనుగొనబడ్డాయి. విషయాన్ని విమానం అదృశ్యమైనప్పటి నుంచి దాదాపు 20 గంటల తర్వాత, నేపాల్ సైన్యం సోమవారం తెలిపింది.

Nepal Plane Crash: all passengers killed, 14 Bodies Recovered From Wreckage Of Tara Aircraft In Mustang

శోధన, రెస్క్యూ దళాలు విమానం కూలిపోయిన స్థలాన్ని భౌతికంగా గుర్తించాయి. వివరాలను అనుసరిస్తామని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ నారాయణ్ సిల్వాల్ ట్విట్టర్‌లో తెలిపారు.

"క్రాష్ సైట్: సనోస్‌వేర్, థసాంగ్-2, ముస్తాంగ్", విమాన శకలాలుగా కనిపించే చిత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు.

పోలీసు ఇన్‌స్పెక్టర్, గైడ్ లెఫ్టినెంట్ మంగళ్ శ్రేష్ఠ ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు.

"వివిధ ఏజెన్సీలకు చెందిన ఇతర రెస్క్యూ టీమ్ సభ్యులు చిన్న హెలికాప్టర్‌లను ఉపయోగించి సైట్‌లకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సైట్‌కు చేరుకోవడానికి సాధ్యమయ్యే ప్రతి మార్గాలను పరిశీలిస్తున్నారు" అని బ్రిగ్ జనరల్ సిల్వాల్ చెప్పారు.

రక్షణ దళాలు.. క్రాష్ సైట్ నుంచి 14 మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి అవశేషాల కోసం ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మృతి

కాగా, ఈ విమానంలో ఉన్న నలుగురు భారతీయులు ఒకే కుటుంబానికి చెందినవారే. మహారాష్ట్రకు చెందిన వైభవి త్రిపాఠితోపాటు ఆమె భర్త అశోక్, పిల్లలు ధనుష్, రితికాలుగా వారిని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వైభవి త్రిపాఠి అక్కను ముంబై పోలీసులు సంప్రదించారు. అయితే, ఈ ప్రమాదం గురించి తన తల్లికి చెప్పవద్దని, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అభ్యర్థించారు. నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం ముంబై పోలీసులను సంప్రదించింది.

English summary
Nepal Plane Crash: all passengers killed, 14 Bodies Recovered From Wreckage Of Tara Aircraft In Mustang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X