వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెల్టా + ఒమిక్రాన్: వెలుగులోకి వచ్చిన డెల్టాక్రాన్: భయపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్

|
Google Oneindia TeluguNews

నికోసియా: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తోన్నాయి. ఇదివరకు డెల్టా..ఆ తరువాత డెల్టా ప్లస్ వేరియంట్లు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. కొంత గ్యాప్ ఇచ్చి.. ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌తో పోల్చుకుంటే- ఒమిక్రాన్ ఎంత భయానకమో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినట్లుగా డెల్టాల కంటే వేంగా వ్యాప్తి చెందుతోందీ వేరియంట్. తొలి కేసు నమోదైన అతి కొద్దిరోజుల్లోనే దీని సంఖ్య వేలల్లోకి చేరుకుంది. అమెరికా సహా యూరప్ దేశాల్లో దీన్ని విస్తరణ మరింత అధికంగా ఉంటోంది.

ఇప్పుడీ రెండింటి కలయికతో కొత్త కరోనా వైరస్ వేరియంట్ మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని పేరు డెల్టాక్రాన్. డెల్టా ప్లస్ ఒమిక్రాన్ కలయికతో ఇది పుట్టుకొచ్చింది. తొలి కేసులు సైప్రస్‌లో నమోదయ్యాయి. డెల్టాక్రాన్‌ స్ట్రెయిన్‌‌ను సైప్రస్‌ యూనివర్సిటీ ఆఫ్ బయాలజికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌, ల్యాబోరేటరీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మాలిక్యులర్‌ వైరాలజీ డీన్ లియోండియోస్‌ కోస్ట్రికిస్‌ గుర్తించారు. ఒమిక్రాన్, డెల్టా కో-ఇన్ఫెక్షన్‌ కేసులు సైప్రస్‌లో పుట్టుకొచ్చినట్లు నిర్ధారించారు. డెల్టా, ఒమిక్రాన్ కాంబినేషన్స్ ఇందులో కనిపించాయని స్పష్టం చేశారు.

new Covid19 variant Deltacron that combines features of the Delta and Omicron detected in Cyprus

ఈ కొత్త వేరియంట్‌‌కు డెల్టా తరహా జన్యు నేపథ్యం ఉందని వివరించారు. కొన్ని ఒమిక్రాన్‌ మ్యుటేషన్లను ఈ వేరియంట్‌లో కనుగొన్నామని తెలిపారు. ఈ డెల్టాక్రాన్ కేసులు సైప్రస్‌లో ఒకేసారి 25 వరకూ నమోదయ్యాయని, ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని లియోండియోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డెల్టాక్రాన్‌ లక్షణాలు ఎలాంటివనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కొనసాగుతోందని చెప్పారు. ఈ వేరియంట్ ఎంత వరకు ప్రమాదకరమనే విషయంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఈ డెల్టాక్రాన్ వ్యాప్తి వేగం గురించి కూడా ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని సైప్రస్ ప్రభుత్వం పేర్కొంది. దీనితో ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి హడ్జిపాండేలాస్ పేర్కొన్నారు. యూనివర్సిటీ నుంచి నివేదికలను తెప్పించుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ వేరియంట్ వల్ల భయపడాల్సిన పని లేదని, దీనిపై అధ్యయనం కొనసాగుతోందని అన్నారు. డెల్టాక్రాన్‌తో ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 25 మంది ఈ డెల్టాక్రాన్ కనిపించినట్లు యూనివర్శిటీ ప్రొఫెసర్లు నివేదిక ఇచ్చారని అన్నారు.

English summary
A professor of biological sciences in Cyprus has claimed that a new strain of SARS-CoV-2 that combines features of the Delta and Omicron variants has been found in his country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X