H-1B, H-4 వీసాలపై మొదలైన షాకులు..! లెక్క తేల్చేస్తున్న ట్రంప్..!
అమెరికా హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై నిశిత పరిశీలన, తనిఖీలను ప్రారంభించింది. నిన్నటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.
అమెరికాలో ఐటీ, ఇతర ఉద్యోగాల కోసం వెళ్లే విదేశీ నిపుణులు హెచ్1బీ(H-1B) వీసాలకు, వారి కుటుంబ సభ్యులు హెచ్4 వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఇలా విదేశాల నుంచి వచ్చిపడుతున్న నిపుణుల వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ట్రంప్ సర్కార్ తాజాగా నిబంధనల్లో కీలక మార్పులు తెచ్చింది. వీటి ప్రకారం వారు ఎక్కడ దొరికినా వీసా దరఖాస్తు తిరస్కరించడమే పనిగా పెట్టుకుంది. ఇలాంటి పరిణామాల మధ్య దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన (వెట్టింగ్ ) ప్రారంభమైంది.
అమెరికా హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై నిశిత పరిశీలన, తనిఖీలను ప్రారంభించింది. నిన్నటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. దీంతో తాజాగా అమల్లోకి వచ్చిన ఈ నూతన విధానం ప్రకారం అమెరికాలోకి ప్రవేశించడానికి "అనర్హులు"గా పరిగణించబడే వారిని గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. వలసలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ తనిఖీలు ప్రారంభించారు.

ట్రంప్ సర్కార్ తాజా నిబంధనల ప్రకారం.. అమెరికా వీసా అనేది "హక్కు కాదు, ఒక ప్రత్యేక అధికారం" మాత్రమే. ప్రతి వీసా మంజూరు జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయమేనని తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. విదేశీ ఉద్యోగులకు జారీ చేసే హెచ్-1బీ వీసాను, అమెరికా కంపెనీలు ఇతర దేశాల నుండి నిపుణులను నియమించుకోవడానికి వాడుకుంటున్నాయి. సాంకేతిక నిపుణులు, ఇతర రంగాల నిపుణులు ఈ వీసా ద్వారా అమెరికాలో పని చేసే అవకాశం పొందుతారు.

అయితే ఈ హెచ్-1బీ వీసా కార్యక్రమం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నవారు భారతీయులే. సుమారు 70 శాతానికి పైగా హెచ్-1బీ వీసాలు భారతీయులకే ఇస్తున్నారు. అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం తాజా ఉత్తర్వుతో భారతీయులే ఎక్కువగా నష్టపోవడం ఖాయమనే అంచనాలున్నాయి. ఆ తర్వాత 11 నుండి 12 శాతం వీసాలతో చైనా పౌరులు రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 3 లక్షల మంది భారతీయ హెచ్-1బీ వీసాదారులు సాంకేతిక, సేవా రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ నిబంధన అమలులోకి రాకముందే, భారత్ లో అమెరికా రాయబార కార్యాలయం వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసింది. దీనివల్ల చాలా మంది దరఖాస్తుదారులు చిక్కుకుపోయి, వారి ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్నాయి.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications