వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీణా-వాణిల విషయంలో సాధ్యపడనిది.. అక్కడ మాత్రం సక్సెస్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : అవిభక్త కవలలు వీణా వాణిల్లాగే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ కవల పిల్లల జంట తలలు అతుక్కుని పుట్టింది. అయితే ఏళ్లు గడుస్తున్నా.. వీణా వాణిల విషయంలో సాధ్యపడని ఆపరేషన్ ను, అమెరికన్ వైద్యులు చేసి చూపించారు. అదీ 13 నెలల వయసున్న చిన్నారులకు. జేడన్, అనియాస్ అనే ఇద్దరు అవిభక్త కవలల తలలను విజయవంతంగా విడదీయగలిగారు అక్కడి వైద్యులు.

ఇక వీణా వాణి విషయంలో.. ఓమారు లండన్ వైద్యులు.. మరోమారు మెల్ బోర్న్ వైద్యులు ఆపరేషన్ కు ముందుకు రాగా.. ఆపరేషన్ మాత్రం ఇప్పటికీ జరగలేదు. ఇక న్యూయార్క్ కవలల విషయానికొస్తే.. నికోల్ క్రిస్టినా అనే దంపతులకు రెండో సంతానంగా కవలల పిల్లలు జన్మించారు. అయితే వీరిద్దరు తలలు అతుక్కుని పుట్టారు. ఇరువురి కపాలాలు కలిసుండడంతో.. డాక్టర్ జేమ్స్ గుడ్ రిచ్ ను సంప్రదించారు తల్లిదండ్రులు.

New life, apart: Rare surgery to separate brothers conjoined at head

అనితర సాధ్యమనుకున్న ఆపరేషన్లను చేయడంలో ధిట్ట అనిపించుకున్న సదరు వైద్యుడు కూడా ఈ కేసును అత్యంత క్లిష్టతరమైనదిగా భావించాడు. అయితే చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం ఎలాగైనా ఆపరేషన్ చేయాల్సిందేనని పట్టుబడడంతో శస్త్ర చికిత్స చేయడానికి పూనుకున్నాడు డాక్టర్ జేమ్స్.

అలా.. మొత్తం 20మంది వైద్యులు 27 గంటల పాటు కష్టపడి ఆపరేషన్ ను విజయవంతం చేశారు. మొదటి 16 గంటల పాటు చిన్నారుల తలలను వేరుచేయడానికి శ్రమించిన వైద్యులు.. అనంతరం త్రీడీ టెక్నాలజీ ద్వారా కపాలాలను వేరుచేశారు. సర్జరీకి మరో 11 గం.ల సమయం పట్టింది. మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ కావడంతో.. ఇప్పుడా తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకుని మురిసిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఓవైపు వీణా-వాణిల వయసు పెరిగిపోతున్నా.. వారి ఆపరేషన్ కు మాత్రం ఇప్పటికీ మోక్షం లభించలేదు. తాజా ఆపరేషన్‌తో ఇలాంటి ఆపరేషన్లు చేయడంలో సమర్థుడనిపించుకున్న అమెరికన్ డాక్టర్ జేమ్స్ వైపు ఒకసారి ఇక్కడి వైద్యులు దృష్టి సారిస్తే.. వీణా-వాణిల సమస్యకు ఏమైనా పరిష్కారం లభించవచ్చేమో!

English summary
Anias and Jadon McDonald are twins conjoined at the head. Their birth was rare; science says the boys are one in millions. Their parents couldn't agree more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X