గుర్రపు బగ్గీలు బ్యాన్, వందల ఏళ్ల సంప్రదాయానికి తెర!

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన న్యూయార్క్ నగరంలో శతాబ్దాల నాటి సంప్రదాయానికి తెరపడబోతోంది. సెంట్రల్ పార్క్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన గుర్రపు బగ్గీల సేవలను పూర్తిగా నిషేధిస్తూ న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 2028 నాటికి ఈ బగ్గీలను నగర వీధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు వీలుగా ఒక బిల్లును ఆమోదించింది. ఇటీవల ఒక భారతీయ పర్యాటక యువకుడు ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ నిషేధానికి మద్దతు మరింత పెరిగింది. మేయర్ జోహ్రాన్ మమ్దానీ మద్దతుతో రూపొందించిన ఈ ప్రతిపాదనపై గురువారం నిర్వహించిన ఓటింగ్‌లో కౌన్సిల్ సభ్యులు 40-7 మెజారిటీతో ఆమోదం తెలిపారు.

ఈ తీవ్ర నిర్ణయానికి జూన్ 17న జరిగిన ఒక విషాదకర ఘటనే ప్రధాన కారణమైంది. కుటుంబంతో కలిసి న్యూయార్క్ సందర్శనకు వచ్చిన 18 ఏళ్ల భారతీయ యువకుడు రోమాంచ్ మహాజన్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మహాజన్ కుటుంబ సభ్యులను ఫొటో తీసేందుకు బగ్గీ డ్రైవర్ పక్కకు తప్పుకున్న సమయంలో, గుర్రం ఒక్కసారిగా బెదిరి ఉరికింది. ఈ క్రమంలో తీవ్రంగా భయపడిన ఆ యువకుడు బగ్గీ నుంచి కిందపడిపోవడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘోర ఉదంతం నగర ప్రజలను, జంతు సంక్షేమ సంఘాలను తీవ్రంగా కలిచివేసింది. పర్యాటకుల భద్రత, జంతువులపై నిర్బంధ శ్రమను నిరసిస్తూ గుర్రపు స్వారీని తక్షణమే నిషేధించాలనే డిమాండ్లు గట్టిగా వినిపించాయి.

New York City Votes To Ban Horse Drawn Carriages By June 2028 Following Indian Tourist Fatal Accident
 Marriage: గుర్రం మీద బయలుదేరడానికి పెళ్లికొడుకు రెఢీ, విమానం ఎక్కించిన పోలీసులు !
Marriage: గుర్రం మీద బయలుదేరడానికి పెళ్లికొడుకు రెఢీ, విమానం ఎక్కించిన పోలీసులు !

ట్రంప్ విమర్శలు: కార్ల ప్రమాదాలు జరగడంలేదా?

అయితే నగర కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్రపు బగ్గీలు న్యూయార్క్ నగర చారిత్రక సంస్కృతిలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు. సెంట్రల్ పార్క్ సమీపంలోనే తన వ్యాపార ప్రధాన కార్యాలయం ట్రంప్ టవర్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. పార్కు ప్రాంతంలో రోజూ ఎన్నో కార్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగని పార్కులోకి కార్లను రాకుండా ఆపేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక గొప్ప సంప్రదాయాన్ని, చరిత్రను కాల రాశారని, ఈ రవాణా సేవలను నగరవాసులు ఖచ్చితంగా మిస్ అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

కార్మికులకు పునరావాసం.. గుర్రాలకు రక్షణ

కౌన్సిల్ ఆమోదించిన కొత్త చట్టం ప్రకారం, ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్తు కోసం ఏప్రిల్ నాటికి ఒక నిర్దిష్ట పరివర్తన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బగ్గీ యజమానులకు నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని కూడా నగరం పరిశీలిస్తోంది. ఇన్నాళ్లూ సేవలు అందించిన గుర్రాలను ఏ రకంగానూ వధించకూడదని, వాటికి తగిన సంరక్షణ కేంద్రాలు లేదా ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలని స్పష్టమైన నిబంధన విధించారు.

కంటికి కనిపించని మృత్యుపాశం: మనం తాగే నీళ్లలో 'ట్రోజన్ హార్స్'?
కంటికి కనిపించని మృత్యుపాశం: మనం తాగే నీళ్లలో 'ట్రోజన్ హార్స్'?

కోర్టు మెట్లెక్కనున్న కార్మిక సంఘం

సిటీ కౌన్సిల్ బిల్లు ఆమోదించినప్పటికీ, దీని అమలు సులభంగా జరిగేలా కనిపించడం లేదు. గుర్రపు బగ్గీ యజమానులు, డ్రైవర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఈ నిషేధాన్ని న్యాయపరంగా సవాలు చేసేందుకు సిద్ధమైంది. చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే న్యాయస్థానం నుంచి తాత్కాలిక స్టే ఆర్డర్ పొందేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది. నగర చరిత్రలోనే లైసెన్స్ కలిగిన ఒక వృత్తిని ఉన్నపళంగా నిషేధించడం ఇదే మొదటిసారి కావచ్చని.. ఇది తమ ఆస్తి, జీవనోపాధి హక్కులను కాలరాయడమేనని యూనియన్ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో ఈ కోర్టు వివాదం ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+