Marriage: గుర్రం మీద బయలుదేరడానికి పెళ్లికొడుకు రెఢీ, విమానం ఎక్కించిన పోలీసులు !

హర్యానా/న్యూఢిల్లీ: యువకుడికి, ఓ యువతికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలని పెళ్లికూతురి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగానే బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలు ఇవ్వడంతో అందరూ పెళ్లికి బయలుదేరారు. రాత్రి రిసెప్షన్ కు హాజరుకావడానికి సాంప్రధాయబద్దంగా గుర్రం మీద బయలుదేరడానికి పెళ్లి కొడుకు రూమ్ లో రెఢీ అవుతున్నాడు. అంతవరకు అంతా బాగనే ఉన్నా తరువాత పెళ్లి కొడుకు వేసిన స్కెచ్ మొత్తం సర్వనాశనం అయ్యింది. గుర్రం ఎక్కవలసిన పెళ్లి కొడుకును పోలీసులు విమానం ఎక్కించారు.

 గుర్రం మీద బయలుదేరడానికి రెఢీ అయిన పెళ్లికొడుకు

గుర్రం మీద బయలుదేరడానికి రెఢీ అయిన పెళ్లికొడుకు

హర్యానాలోని రోహ్వక్ లో ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆయువకుడి పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర గుర్రాన్ని పిలుచుకుని వెళ్లాడు.పెళ్లికొడుకు పెళ్లి చేసుకోవడానికి గుర్రం మీద బయలుదేరాలని వారి సాంప్రధాయం. పెళ్లి కొడుకు గుర్రం ఎక్కడానికి రెఢీ అవుతున్నాడు.

 పెళ్లి కొడుకు కాలర్ పట్టుకుని లాక్కొని వచ్చారు

పెళ్లి కొడుకు కాలర్ పట్టుకుని లాక్కొని వచ్చారు

ఆ సందర్బంలో పెళ్లి కొడుకు ఇంటికి రోహ్వాక్ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారులు వెళ్లారు. రిసెప్షన్ కు రెఢీ అవుతున్న పెళ్లి కొడుకు కాలర్ పట్టుకున్న మహిళా పోలీసులు అతన్ని ఇంటిలో నుంచి బయటకు లాక్కొని వచ్చారు. హడలిపోయిన కుటుంబ సభ్యులు ఏం జరిగింది అంటూ పోలీసులను ప్రశ్నించారు.

 రేప్ చేసి చంపేస్తానని బెదిరించిన పెళ్లికొడుకు

రేప్ చేసి చంపేస్తానని బెదిరించిన పెళ్లికొడుకు

పోలీసులు అప్పుడు అసలు స్టోరీ చెప్పాడు. రోహ్వాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో 17 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నదని. రెండు నెలల క్రితం పెళ్లికొడుకు ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడని. విషయం బయటకు చెబితే నీతో పాటు మీ అమ్మను చంపేస్తానని పెళ్లి కొడుకు బెదిరించాడని రోహ్వాన్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారి ప్రమీల చెప్పారు.

 మరో అమ్మాయి జీవితం నాశనం అవుతోంది

మరో అమ్మాయి జీవితం నాశనం అవుతోంది

యువతి మీద అత్యాచారం చెయ్యడంతో ఆమె గర్బవతి అయ్యిందని, ఆమెకు న్యాయం చెయ్యకుండా అబార్షన్ చెయ్యడానికి పెళ్లి కొడుకు ప్రయత్నించాడని పోలీసు అధికారి ప్రమీల చెప్పారు. ఓ అమ్మాయి జీవితం నాశనం చెయ్యడమే కాకుండా నిందితుడు ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడని పోలీసు అధికారి ప్రమీల అన్నారు.

 పెళ్లి జరిపించాలని కాళ్లు పట్టుకున్న పెళ్లి కొడుకు

పెళ్లి జరిపించాలని కాళ్లు పట్టుకున్న పెళ్లి కొడుకు

పెళ్లి జరిగిన తరువాత అరెస్టు చెయ్యాలని పెళ్లి కొడుకు లేడీ పోలీసు అధికారి ప్రమీల కాళ్లు పట్టుకున్నాడు. అయితే మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదని పెళ్లి కొడుకును అరెస్టు చేసి కోర్టు మందు హాజరుపరిచారు. కోర్టు పెళ్లి కొడుకును పోలీస్ కస్టడీకి ఇచ్చింది. అమ్మాయికి వైద్యపరీక్షలు చేయించి నిందితుడిని విచారణ చేస్తున్నామని రోహ్వాన్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారి ప్రమీల స్థానిక మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+