న్యూయార్క్ పెన్షన్ ఫండ్ స్కాం: భారత సంతతి అధికారికి డబ్బు, అమ్మాయిలతో ఎర
భారీ మొత్తంలో డబ్బు, డ్రగ్స్, లగ్జరీ వెకేషన్లతో పాటు అమ్మాయిల ప్రలోభానికి లోనైనందుకు భారత సంతతికి చెందిన ఓ మాజీ అధికారిపై బుధవారం అమెరికాలో కేసు నమోదు అయింది.
న్యూయార్క్: భారీ మొత్తంలో డబ్బు, డ్రగ్స్, లగ్జరీ వెకేషన్లతో పాటు అమ్మాయిల ప్రలోభానికి లోనైనందుకు భారత సంతతికి చెందిన ఓ మాజీ అధికారిపై బుధవారం అమెరికాలో కేసు నమోదు అయింది. న్యూయార్క్ స్టేట్ కామన్ పెన్షన్ ఫండ్ కు చెందినా మాజీ డైరెక్టర్, స్ట్రాటజిస్టు అయిన నవనూర్ కంగ్(38) ను ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ ల్యాండ్ లో అరెస్ట్ చేసి, ఫెడరల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు.
నవనూర్ కంగ్ బిలియన్ల కొద్దీ డాలర్లను బ్రోకర్ డీలర్ల కు ఇవ్వగా, వాళ్ళు ఆయనకు ఖరీదైన వాచీలు, డ్రగ్స్, డబ్బుతోపాటు వేశ్యలను, స్ట్రిప్పర్లను సరఫరా చేశారని మన్ హట్టన్ ఫెడరల్ కోర్టు ప్రాసిక్యూటర్ ప్రీత్ భారారా ఆరోపించారు. నవనూర్ కంగ్ కు అందిన లంచాలలో దాదాపు రూ.౧౨ లక్షల విలువైన పనెరాయ్ వాచీ కూడా ఉందని ఆరోపించారు.

నవనూర్ కంగ్ గతంలో టెన్నిస్ ప్లేయర్ కూడా. 2005, 2006 సంవత్సరాల్లో అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. న్యూయార్క్ స్టేట్ కామన్ రిటైర్మెంట్ ఫండ్ అనేది అమెరికాలోనే మూడో అతిపెద్ద పెన్షన్ ఫండ్.
స్థిర ఆదాయం వచ్చే సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెట్టాల్సిన దాదాపు ౩.60 లక్షల కోట్లను నవనూర్ కంగ్ ఇతర వ్యాపారాల్లోకి మళ్ళించారని, ఈ విషయంలో రెండు బ్రోకరేజి సంస్థలకు చెందిన ఉద్యోగులతో కుమ్మక్కై, ఆయన లంచాలు తీసుకున్నారనిది ప్రధాన ఆరోపణ. బ్రోకరేజి ఉద్యోగుల్లో ఒకరైన డెబోరా కెల్లీ మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈ ఆరోపణలు గనుక రుజువైతే వీరిద్దరికీ 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు.












Click it and Unblock the Notifications