వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఉగ్రవాది పేరు పలకను : న్యూజిలాండ్ పార్లమెంటులో ప్రధాని జసిండా

|
Google Oneindia TeluguNews

క్రైస్ట్‌చర్చ్‌ : న్యూజిలాండ్ పార్లమెంటులో ఉద్విగ్నభరిత వాతావరణం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెన్ ప్రసంగించిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఉగ్రవాది బ్రెంటన్‌ టారంట్‌ ఇటీవల క్రైస్ట్‌ చర్చ్‌ నగరంలో కాల్పులకు పాల్పడి దాదాపు 50 మంది అమాయకులకు పొట్టన పెట్టుకున్నాడు. ఇదే అంశంపై చర్చించేందుకు న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ క్రమంలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు జసిండా ఆర్డెన్. ప్రశాంతతకు ఆలవాలమైన న్యూజిలాండ్‌లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది పేరు తాను పలకబోనంటూ స్పష్టం చేశారు.

new zealand pm jacinda ardern says never speak christchurch terrorist name

ఉగ్రదాడితో అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుని బీభత్సం సృష్టించిన అతడి పేరు తాను ప్రస్తావించబోనంటూ తేల్చి చెప్పారు. దేశ ప్రజలు సైతం ఆ ఉగ్రవాది పేరు పలకొద్దని కోరారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి పేర్లు ఉచ్ఛరించండి గానీ ఆ దుర్మార్గుడి పేరు తలచొద్దని సూచించారు. టెర్రరిస్ట్, క్రిమినల్ గా సంబోధిస్తానే తప్ప అతడి పేరు ప్రస్తావించబోనంటూ స్పష్టం చేశారు. న్యూజిలాండ్ చట్టాల ప్రకారం ఆ ఉగ్రవాదిని కఠినంగా శిక్షిస్తామని సభాముఖంగా తెలిపారు.

చింత‌మ‌నేని పై ప‌వ‌న్ వ‌దులుతున్న బాణం..! మ‌హిళా అభ్య‌ర్థితో చెక్ పెడుతున్న గబ్బ‌ర్ సింగ్..!! <br>చింత‌మ‌నేని పై ప‌వ‌న్ వ‌దులుతున్న బాణం..! మ‌హిళా అభ్య‌ర్థితో చెక్ పెడుతున్న గబ్బ‌ర్ సింగ్..!!

ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్‌ టారంట్‌ జాత్యహంకారంతో రెచ్చిపోయాడు. పోయిన శుక్రవారం న్యూజిలాండ్‌లోని అల్‌ నూర్, లిన్‌వుడ్‌ మసీదుల దగ్గర విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఘాతుకమంతా వీడియో తీస్తూ ఫేస్‌బుక్‌ మాధ్యమంలో లైవ్‌ ఇచ్చాడు. ఆ ఉగ్రవాది కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.

English summary
While addressing her nation's government Newzealand Prime Minister Jacinda Ardern said “you will never hear me mention” the name of the alleged Christchurch gunman. “Speak the names of those who were lost rather than the name of the man who took them,” she added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X