హనీమూన్‌లో నో సెక్స్, పైళ్ళైన 10 రోజులకే విడాకులకెళ్ళిన భర్త
దుబాయ్: హనీమూన్ సమయంలో సెక్స్‌కు ఒప్పుకోలేదని పెళ్ళైన పది రోజులకే తనకు విడాకులు మంజూరు చేయాలని కోర్టు మెట్లెక్కాడు ఓ వ్యక్తి. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చోటు చేసుకొంది.
వివాహమైన తర్వాత హనీమూన్‌ను జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ప్రతి జంట భావిస్తోంది. దీని కోసం ప్రపంచంలో తమకు నచ్చిన ప్రాంతానికి హనీమూన్ కోసం వెళ్ళే జంటలు లేకపోలేదు.
కానీ, దుబాయ్‌కు చెందిన ఓ జంటకు హనీమూన్ చేదునే మిగిల్చింది. హనీమూన్ నుండి వచ్చిన ఆ జంట విడాకులను కోరుకొంది. భార్య, భర్తలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకొంటున్నారు.

సెక్స్‌కు సహకరించలేదని విడాకులు కోరిన భర్త
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ జంటకు పదిరోజుల క్రితం వివాహమైంది. వివాహమైన తర్వాత హనీమూన్ కోసం ఆ జంట యూరప్ వెళ్ళారు. హనీమూన్ సమయంలో భార్య సెక్స్‌కు సహకరించలేదని భర్త ఆరోపిస్తున్నాడు. హనీమూన్ ట్రిప్ నుండి వచ్చిన భర్త తనకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు.

నా కోసం డబ్బులు ఖర్చు చేయలేదు
భర్త ఆరోపణలను భార్య కొట్టిపారేసింది. తన కోసం తన భర్త డబ్బులను ఖర్చు చేయడం లేదని భార్య ఆరోపిస్తోంది. తన భర్త పిసినారిగా విమర్శలు గుప్పించింది. తన భర్త నుండి విడాకులు కావాలని కూడ ఆమె డిమాండ్ చేసింది.

కౌన్సిలింగ్ ఇచ్చినా
కొత్త జంటకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దఫా దపాలుగా కౌన్సిలింగ్ కొనసాగింది. అయితే ఈ కౌన్సిలింగ్‌ను పట్టించుకోలేదు. విడాకులు కావాలని నవ దంపతులు కోరారు. తమ పంతాన్ని వీడలేదు

షరియా కోర్టుకు కేసు అప్పగింత
పలు దఫాలుగా నవ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది . దీంతో ఈ కేసును షరియా కోర్టుకు కేసును అప్పగించారు. ఈ కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేస్తోందా, లేదా అనేది ఆసక్తి నెలకొంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications