టెర్రరిస్ట్‌లకు బదులు శరణార్థులపై దాడి, 100 మంది మృతి: 'పెద్ద పొరపాటు చేశాం'

నైజీరియాలో ఘోరం జరిగింది. బోకో హారం తీవ్రవాదుల పైన వైమానిక దాడి చేయగా అది పొరపాటున శరణార్థుల శిబిరం పైన పడ్డాయి. ఈ ఘటనలో వందమంది వరకు మృతి చెందారని తెలుస్తోంది.

కానో: నైజీరియాలో ఘోరం జరిగింది. బోకో హారం తీవ్రవాదుల పైన వైమానిక దాడి చేయగా అది పొరపాటున శరణార్థుల శిబిరం పైన పడ్డాయి. ఈ ఘటనలో వందమంది వరకు మృతి చెందారని తెలుస్తోంది.

శరణార్థులతో పాటు వైద్యం సహా అనేక సేవలు అందిస్తున్న స్వచ్చంధ కార్యకర్తలు సైతం మృత్యువాత పడ్డారు. ఈశాన్య నైజీరియాలోని రన్ నగరం చాన్నాళ్లుగా బోకో హారం తీవ్రవాదుల గుప్పిట్లో ఉంది.

air force

ఈ నగరం పైన సైనిక చర్యకు దిగిన నైజీరియా బలగాలు మంగళవారం నాడు వైమానిక దాడులు నిర్వహించాయి. రన్‌లోని తీవ్రవాదులు శిబిరాలు లక్ష్యంగా ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించగా.. శరణార్థుల శిబిరంపై పడ్డాయి.

తమ వైపు నుంచి పెద్ద పొరపాటు జరిగిందని మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబర్ తెలిపారు. కాగా, నైజీరియా మిలటరీ దాదాపు తొలిసారి ఇలాంటి పొరపాటును ఒప్పుకుంది. ఈ ఘటనపై నైజీరియా ప్రెసిడెండ్ ముహమ్మదు బుహారీ ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+