ఆత్మాహుతి దాడి: పదేళ్ల పాపకి బాంబులు చుట్టారు
అబుజ: బోకో హరామ్ ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను నైజీరియా సైన్యం అరెస్ట్ చేసినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కారులో వెళ్తున్న వారు తమ వెంట ఓ పదేళ్ల బాలికను తీసుకెళ్తాన్నురాని, ఆ బాలిక శరీరం చుట్టూ భారీ పేలుడు పదార్థాలు బెల్ట్ పెట్టి చుట్టారని నైజీరియా అధికారులు తెలిపారు.
చిన్నారిని అడ్డు పెట్టుకుని తమ పని చేసుకోవడానికి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దర్నీ అరెస్ట్ చేశామని తెలిపారు. బాలికను పేలుడు పదార్థాల నుంచి విముక్తురాలిని చేశామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దీనిపై ప్రభుత్వ అధికార ప్రతినిధి మైక్ ఒమరియా మాట్లాడుతూ.. పదేళ్ల హడిజకు పేలుడు పదార్థాలను చుట్టి తమను తాము రక్షించుకునేందుకు, తమ పనిని పూర్తి చేసేందుకు ఉగ్రవాదులు ఇలియా, జైనబ్‌లు నిర్ణయించారని తెలిపారు. అయితే నైజీరియా అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ నిర్వహించడంతో ఆ బాలిక విముక్తురాలైందని చెప్పారు. ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
పశ్చిమ నైజీరియాలోని కానో ప్రాంతంలో వారం రోజులుగా ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఆత్మహుతి దాడులకు ఎక్కువగా మహిళలను, చిన్నారులను ఉపయోగించుకుంటున్నారు. బుధవారం ఈ ప్రాంతంలో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో 8మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications