Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెత్తురోడిన కాబూల్: బాంబు పేలుళ్లలో 29మంది మృతి..

కాబూల్: ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ నగరం‌లో మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో మొత్తం 29మంది మృతిచెందగా, ఇందులో 9మంది జర్నలిస్టులు సహా ప్రముఖ మీడియా సంస్థ ఏఎఫ్‌పీ(ఏజెన్స్-ఫ్రాన్స్ ప్రెస్) కి చెందిన ఫోటోగ్రాఫర్‌ షా మరై ఉన్నారు.

Nine journalists among 29 killed in twin Afghanistan blasts

సోమవారం ఉదయం 8గం. సమయంలో షష్డారక్ ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలువురు ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు అక్కడికి చేరుకోగా మరో పేలుడు సంభవించింది. కెమెరామెన్ లాగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు.

ఈ రెండు పేలుడు ఘటనల్లో మొత్తం 29 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 45 మంది గాయపడ్డారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలోనే అమెరికన్ దౌత్య కార్యాలయం కూడా ఉండటం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+