భారత్-పాక్ చర్చలు వాయిదా: అరెస్టు అయ్యాడా ?
ఇస్లామాబాద్: భారత్- పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు వాయిదా పడ్డాయి. పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసులో జైష్-ఏ- అహమ్మద్ చీఫ్ మౌలనా మసూద్ అజార్ ను అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా దృవీకరించలేదు.
విదేశాంగ కార్యదర్శుల చర్చలను వాయిదా వేస్తున్నామని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల కంటే భారత్ తో జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలు ఉంటాయని పాక్ ప్రభుత్వం తెలిపింది.
అనంతరం విదేశాంగ కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తామని పాక్ వర్గాలు చెప్పాయి. భారత్ ప్రభుత్వ వర్గాలు ఇదే వైఖరిని వెల్లడించాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ఉగ్రదాడికి సంబంధించి తమ దర్యాప్తు వివరాలు భారత్ తో పంచుకోలేదని పాక్ వర్గాలు తెలిపాయి.

మొదట ఎన్ఎస్ఏ చర్చలు నిర్వహించనున్నట్లు పాక్ వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తుకు మాకు మరింత సమయం కావాలని, మరింత ముందుకు కొనసాగించేందుకు తమకు సమాచారం కావాలని, తమ విచారణ బృందం భారత్ లో పర్యటించాలనుకుంటున్నదని పాక్ వర్గాలు తెలిపాయి.
అయితే పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఖలిలుల్లా ఖాజి గురువారం మీడియాతో మాట్లాడారు. మసూద్ అజార్ అరెస్టు అయిన విషయం తనకు తెలియదని అన్నారు. చర్చలు మరో సారి జరుగుతాయని, ఉగ్రవాదం ఇరు దేశాలకు పెద్ద సమస్య అయ్యిందని తెలిపారు.












Click it and Unblock the Notifications