భారత్‌ను బెదిరించలేరు: చైనాకు రాజ్, నల్లధనంపై స్విస్

న్యూఢిల్లీ/బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు సమీపంలో భారత్ రహదారి నిర్మించడంపై చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. చైనాకు ధీటుగా స్పందించారు. గుర్గావ్‌లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ జీ) రైజింగ్ డే సందర్భంగా మాట్లాడారు.

భారత్‌కు ఎవరూ హెచ్చరికలు జారీ చేయలేరన్నారు. భారత్ చాలా శక్తిమంతమైన దేశమని చెప్పారు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. చైనా, భారత్ రెండు దేశాలు కలిసి చర్చించుకోవాలన్నారు.

కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని మెక్ మోహన్ రేఖ వెంబడి రహదారి నిర్మాణం చేపట్టాలని భారత్ చేస్తున్న ప్రయత్నానికి చైనా బుధవారం స్పందించింది. సరిహద్దు వివాదం చివరి దశకొచ్చిన ఈ సందర్భంలో భారత్ దానికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడదని తాము భావిస్తున్నామని ఆ దేశ అధికారులు అన్నారు.

‘No one can threaten India’, says Rajnath Singh

ఆ ప్రదేశాలను తనిఖీ చేయాల్సిన అవసరముందని, సరిహద్దు సమస్య చైనా, భారత్‌ల వలసలకు సంబంధించినదని, దీనిని సక్రమంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధఇకార ప్రతినిధి హాంగ్ లీ విలేకరులతో బుధవారం చెప్పారు.

నల్లధనంపై వివరాలిస్తాం: స్విట్జర్లాండ్

నల్లధనంపై ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. భారత్ కోరుతున్న విధంగా సమాచారం అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లకు సంబంధించి భారత ప్రభుత్వం అభ్యర్థనలను ప్రాధాన్యతాక్రమంలో పరిశీలిస్తామని, వివరాలను నిర్ణీత కాలవ్యవధిలో అందజేస్తామని హామీ ఇచ్చింది.

భారత ఆర్థిక కార్యదర్శి శక్తికాంతదాస్, స్విట్లర్లాండ్ విదేశీ ఆర్థిక వ్యవహారాల మంత్రి జాక్వెస్ డి వాటెవిల్లె మధ్య బెర్న్‌లో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం 2013 సంవత్సరాంతానికి అక్కడి బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు రూ. 14వేల కోట్లకు చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+