Nobel Prize 2021: మానవ శరీరంలో సెన్సర్ల వంటి కణాలు: మెడిసిన్‌లో ఆ దేశ సైంటిస్టులకు అవార్డ్
స్టాక్‌హోమ్: వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది.
మెడిసిన్‌లో అద్భుతాలను ఆవిష్కరించిన ఇద్దరు అమెరికన్ సైంటిస్టులకు కమిటీ జాయింట్‌గా నోబెల్ బహుమతిని ప్రకటించింది. ఈ సంవత్సరం మెడిసిన్‌కు సంబంధించిన నోబెల్ ప్రైజ్ కోసం డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియన్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. టెంపరేచర్ అండ్ టచ్‌లో గ్రాహకాలను (రెసెప్టర్స్)ను కనుగొన్నందున వారిద్దరికీ నోబెల్ ప్రైజ్ ప్రకటించినట్లు వివరించింది. ప్రజల రోజువారీ వైద్య విధానంలో ఈ ఆవిష్కరణ ఓ మైలురాయి వంటిదని కమిటీ వ్యాఖ్యానించింది.

స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నోబెల్ బహుమతుల ప్యానెల్ కమిటీ సభ్యులు ఈ అవార్డును ప్రకటించారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు డేవిడ్ జూలియస్. ఆర్డెమ్ పటాపౌషియన్ అమెరికాలోని మేరీల్యాండ్‌లో గల హోవర్డ్ హ్యూజెస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెడిసిన్ విభాగానికి అధిపతిగా ఉన్నారు.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 4, 2021
The 2021 #NobelPrize in Physiology or Medicine has been awarded jointly to David Julius and Ardem Patapoutian “for their discoveries of receptors for temperature and touch.” pic.twitter.com/gB2eL37IV7
వారిద్దరూ టెంపరేచర్ అండ్ టచ్‌లో గ్రాహకాలను కనిపెట్టినందున వారికి ఈ సంవత్సరం మెడిసిన్‌లో నోబెల్ బహుమతి అందుకోనున్నారు. మెడిసిన్‌లో ఓ బ్రేక్ త్రూగా దీన్ని అభివర్ణిస్తున్నారు. వేడి, చల్లదనం వంటి ఇతర భావాలను స్పర్శ ద్వారా స్వీకరించాల్సిన అవసరం మన శరీరానికి కావాలి. మన చర్మంలోని కొన్ని కణాలు సెన్సర్లుగా పని చేస్తుంటాయి. వాటిని గుర్తించడానికి డేవిడ్ జూలియస్.. ఎండు మిరప జాతికి చెందిన క్యాప్సయిన్‌లను ఉపయోగించారు.
ఈ సెన్సర్ల వంటి కణాలను గుర్తించడానికి ఆర్డెమ్ పటాపౌషియన్ మెకానికల్ స్టిమ్యులిననీ ప్రయోగించారు. ఈ రెండు ఆవిష్కరణలు.. వైద్యరంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలవని భావిస్తున్నట్లు నోబెల్ ప్రైజ్ కమిటీ తెలిపింది. ఇలాంటి ఆవిష్కరణలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications