వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nobel Prize 2022 in Literature: కిరాణా షాపు కూతురికి నోబెల్..!!

|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనల పరంపర కొనసాగుతోంది. ఆర్థికం, వైద్యం, సాహిత్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్త్రవేత్తలకు ప్రతి సంవత్సరం అందించే ఈ అవార్డులను సోమవారం నుంచి ప్రకటిస్తూ వస్తోంది కమిటీ. వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, రచయితలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు నోబెల్ బహుమతిని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇప్పటికే మెడిసిన్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీకి సంబంధించిన అవార్డులను ప్రకటించారు. మెడిసిన్‌లో స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబొ, ఫిజిక్స్‌లో అలెన్ ఆస్పెక్ట్స్, జాన్ ఎఫ్.క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌కు జాయింట్‌గా నోబెల్ అవార్డ్‌ను ప్రకటించారు. కెమిస్ట్రీలోనూ ముగ్గురికి ఈ అవార్డ్ అందనుంది. కరోలిన్ ఆర్ బెర్టోజ్జి, మోర్టెన్ మెల్డల్, కే బ్యార్రీ షార్ప్‌లెస్‌ సంయుక్తంగా ఈ పురస్కరాన్ని అందుకోనున్నారు.

Nobel Prize 2022 in Literature: The award goes to French author Annie Ernaux

ఇవ్వాళ- సాహిత్యంలో నోబెల్ అవార్డును ప్రకటించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌కు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందజేయనున్నట్లు తెలిపింది. స్వీడన్‌ స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయల్ స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్ మాల్మ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దశాబ్దాల కాలం కిందటే జెండర్ ఈక్వాలిటీ కోసం ఆమె తన రచనల ద్వారా సమాజాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు.

చిరంజీవి గారు.. ఇక ఆపేయండి: మెగాస్టార్‌కు చేదు అనుభవం..!!చిరంజీవి గారు.. ఇక ఆపేయండి: మెగాస్టార్‌కు చేదు అనుభవం..!!

1940 సెప్టెంబర్ 1వ తేదీన ఫ్రాన్స్‌లోని లిల్లెబొన్నె అన్నీ ఎర్నాక్స్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కిరాణా షాప్‌ను నిర్వహించే వారు. యూనివర్శిటీ ఆఫ్ రౌయిన్, యూనివర్శిటీ ఆఫ్ బోర్డాక్స్‌లో ఉన్నత చదువులు అభ్యసించిన ఎర్నాక్స్ సాహిత్యం పట్ల ఆసక్తి చూపారు. 1974లో లెస్ ఆర్మోయిర్స్ వైడ్స్ పేరుతో స్వీయచరిత్రకు నవలా రూపాన్ని ఇచ్చారు. 1984లో ఎ మ్యాన్స్ ప్లేస్ పేరుతో రాసిన నవల.. ప్రతిష్ఠాత్మక రెనాడోట్ అవార్డ్‌కు ఎంపికైంది. తన బాల్యాన్ని ఆమె ఇందులో ప్రతిబింబింపజేశారు.

English summary
Nobel Prize 2022 in Literature awarded to French author Annie Ernaux.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X