ట్రంప్‌కు షాక్: ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కిమ్, అమెరికాలో ఎక్కడైనా దాడి?
Recommended Video

సియోల్: దాదాపు రెండు మాసాలకు పైగా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగం చేశారు. ఉత్తరకొరియాపై అమెరికా ఆంక్షలు విధించిన కారణంగానే ఖండాంతర క్షిపణి ప్రయోగం చేసినట్టుగా కిమ్ ప్రకటించారు.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ వ్యవహరశైలితో ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా అయింది. ఎప్పుడు అణు పరీక్షలు నిర్వహిస్తారో, ఎప్పుడు ఖండాంతర క్షిపణుల ప్రయోగం చేస్తారోననే ఆందోళన ఉండేది.
అయితే రెండు మాసాలకు పైగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. అసలు కిమ్ జాడే కన్పించలేదు. అయితే కిమ్ ఆరోగ్య విషయమై వదంతులు వ్యాపించాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరహలోనే భారీ ట్రక్కులో ఫోటోలకు ఫోజులిస్తూ కిమ్ దర్శనమివ్వడంతో మరోసారి కిమ్ వార్తల్లో నిలిచారు.

ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం
త్తరకొరియా బుధవారం మరోసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. దాదాపు 1000 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో పడినట్లు పెంటగాన్ పేర్కొంది. ఈ ప్రయోగంతో అమెరికాకు పరోక్షంగా ఉత్తరకొరియా సవాల్ విసిరింది.

ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తరకొరియా
ఉత్తరకొరియాను ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న జాబితాలో చేర్చడంతో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టుగా ఆ దేశం ప్రకటించింది. ఇటీవలనే ఉత్తరకొరియాను ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో చేర్చుతున్నట్టు అమెరికా ప్రకటించింది.దీనికి ప్రతీకారంగానే తాము బాలిస్టిక్ పరీక్ష నిర్వహించామని ఉత్తరకొరియా ప్రకటించింది.

అమెరికాలో ఏ ప్రాంతాన్నైనా ఢీకొట్టే సామర్థ్యం
ఈ పరీక్షతో ఉత్తరకొరియా అమెరికాలోని ఏ భూభాగాన్నైనా ఢీ కొట్టగల సామర్ధ్యాన్ని సాధించినట్లు రక్షణ నిపుణుడు ఒకరు చెప్పారు.అమెరికాతో పాటు, యూరప్, ఆస్ట్రేలియాల్లోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్ధ్యం ఉత్తరకొరియా సాధించింది.

అత్యవసరంగా భేటీ కానున్న భద్రతా కౌన్సిల్
ఉత్తరకొరియా తాజా పరీక్షపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ రక్షణను తాము చూసుకుంటామని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ ఉత్తరకొరియా క్షిపణిపరీక్షపై అత్యవసరంగా భేటీ కానుంది. ఉత్తరకొరియా పరీక్షను జపాన్, దక్షిణ కొరియాల అధ్యక్షులు ఖండించారు.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications