వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు లొంగేదీ లేదు.. ఆయుధాల తయారీ ఆపేదీ లేదు, మరోసారి తేల్చి చెప్పిన ఉత్తరకొరియా!

అమెరికాతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్తరకొరియా మరోసారి తన ఉద్దేశ్యాన్ని సుస్పష్టం చేసింది. అమెరికాకు ఏమాత్రం భయపడబోమని తేల్చిచెప్పింది. తాము అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపే ప్రసక్తే లేద

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్‌యాంగ్: అమెరికాతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్తరకొరియా మరోసారి తన ఉద్దేశ్యాన్ని సుస్పష్టం చేసింది. అమెరికాకు ఏమాత్రం భయపడబోమని తేల్చిచెప్పింది.

తాము అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపే ప్రసక్తే లేదని మరోసారి సూటిగా స్పష్టంగా చెప్పేసింది. అమెరికా నుంచి అణుదాడి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా తమ ఆత్మరక్షణ కోసం అణ్వాయుధాలు తప్పనిసరని, అందుకే ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

North Korea issues ultimatum to Trump to cease military drills or face ‘NUCLEAR DETERRENT’

ఉత్తరకొరియాపై విధించిన ఆర్థిక ఆంక్షలపై వాషింగ్టన్ లో స్పందిస్తూ ఉత్తరకొరియా ఐరాస రాయబారి హన్ తే సాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణకొరియాతో అమెరికా సంయుక్తంగా యుద్ధసన్నాహకాలను కొనసాగిస్తోందని, తమ దేశానికి ముప్పుపొంచి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లో అణ్వాయుధాల అభివృద్ధి నిలిపివేయమంటూ తమ దేశాన్ని కోరినా ప్రయోజనం ఉండదని, తమ పని తాము కొనసాగిస్తామని ఉత్తరకొరియా రాయబారి హన్ తే సాంగ్ పునరుద్ఘాటించారు.

వాషింగ్టన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మరోవైపు రోజురోజుకీ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నా అమెరికా, ఉత్తరకొరియా నిర్ణయాలు, అవి స్పందించే విధానం అంతర్జాతీయ రాజకీయ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

English summary
North Korea on Friday ruled out negotiations with Washington as long as joint U.S-South Korea military exercises continue, and said that Pyongyang’s atomic weapons program would remain as a deterrent against a U.S. nuclear threat. In an interview with Reuters, Han Tae Song, North Korea’s ambassador to the United Nations in Geneva, brushed off the new sanctions which the Trump administration has said it is preparing, as well as the possibility of North Korea being added to a U.S. list of states sponsoring terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X